Game Changer Movie Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వాణీ నటిస్తున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ తుది దశ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ అక్టోబర్ 10న రిలీజ్ కానుందని తెలిసింది. అదే రోజున ఎన్టీఆర్, కొరటాల శివ ‘దేవర’ చిత్రం రిలీజ్ అవుతుంది. దేవర చిత్ర యూనిట్ ఇప్పటికే డేట్ కూడా అనౌన్స్ చేసింది. దేవరకు పోటీగా గేమ్ ఛేంజర్ రానుంది. అయితే దేవర ముందే రిలీజ్ అవనుందని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండటంతో కాస్త ముందే రిలీజ్ చేద్దామని నిర్మాతలు భావిస్తున్నారట . సెప్టెంబర్ 27వ తేదీని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Also Read: Yash Toxic: ‘టాక్సిక్’లో మరో బాలీవుడ్ భామ!
వన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 27న వస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో.. ఓజీ ఆ సమయానికి రిలీజ్ కాదని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఓజీ రాకపోతే.. సెప్టెంబర్ 27న దేవర రిలీజ్ కావొచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ ఏడాది ప్రభాస్ కల్కి 2898, ఎన్టీఆర్ దేవర, పవన్ కళ్యాణ్ ఓజీ, అల్లు అర్జున్ పుష్ప 2, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. ఇలా వరుసగా భారీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.