NTR Trust Musical Night: ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ జరగనుంది. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ టీం ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించబోతోంది. దీనికి సంబంధించి ఈరోజు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అధికారిక ప్రకటన చేశారు. ఇక మేనేజింగ్ ట్రస్టీ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇది ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా రైజ్ అయిన ఫండ్స్ ని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తల సేమియా వ్యాధి క్యాంపులకు తల సేమియా వ్యాధిగ్రస్తుల ట్రీట్మెంట్ కి ఉపయోగించబోతున్నారు.
Read Also:Fire-Boltt Cobra Smart Watch: రూ. 20 వేల స్మార్ట్ వాచ్ రూ. 1300కే.. త్వరపడండి
ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తల సేమియా బాధితుల కోసం కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ లో తల సేమియా బాధితుల వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమంలో తమన్ తో పాటు శివమణి కూడా డ్రమ్స్ ప్లే చేయబోతున్నారు.. ఇటీవల తమన్ సంక్రాంతి సందర్భంగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందించిన రాంచరణ్ తేజ గేమ్ చెంజర్ చిత్రంతోపాటు నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలకు సంగీతం అందించారు.
Read Also:JanaSena Party: డిప్యూటీ సీఎం అంశం… జనసేన కీలక ఆదేశాలు..