జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్–ఇండియా ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో అపారమైన అంచనాలు నెలకొన్నాయి. అధికారికంగా టైటిల్ ప్రకటించకపోయినా, అభిమానులు ఇప్పటికే ఈ చిత్రాన్ని ‘డ్రాగన్’ అని పిలుస్తూ హైప్‌ను సృష్టిస్తున్నారు. ఇటీవల కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ఈ మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ మళ్లీ వేగంగా ప్రారంభమైంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న కీలక షెడ్యూల్‌ను నవంబర్ నెలాఖరుకల్లా కంప్లీట్ చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుందట. తర్వాతి షెడ్యూల్‌ను డిసెంబర్‌లో శ్రీలంకలో భారీ స్థాయి సెటప్‌లతో ప్రారంభించేందుకు ముందుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయట. అంటే మొత్తం షూటింగ్‌ను ఎలాంటి లేట్ లేకుండా టైమ్‌కి పూర్తి చేయాలనే ప్లాన్‌తో యూనిట్ స్పీడ్ పెంచిందని తెలుస్తోంది.
Also Read : Jyothi: విజయ్ దేవరకొండతో లిప్‌లాక్ కాదు.. అంతకు మించి అయినా నాకు ఓకే
ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెరగడానికి ప్రధాన కారణం ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ స్టైల్‌కు ఎన్టీఆర్ ఎనర్జీ కలవడం. దీంతో సినిమాపై ఊహించని స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. ఈ చిత్రానికి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా, నిర్మాణ బాధ్యతలను ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. శ్రీలంక షెడ్యూల్ పూర్తయ్యే నాటికి సినిమా నుంచి కొత్త పోస్టర్లు, టీజర్ లేదా టైటిల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.