ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగా అంచనాలు ఆకాశాన్నంటాయి. పైగా ఇది నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనే టాక్ కూడా ఉంది. కెజీయఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నీల్ నుంచి వస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇది. దీంతో.. ఈసారి బాక్సాఫీస్ బద్దలవడం గ్యారెంటీ అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంది. గతంలో చాలాసార్లు వెయిట్ లాస్ అయ్యాడు తారక్. కానీ ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్నడూ లేనంత బరువు తగ్గినట్టుగా లేటెస్ట్ లుక్ చెబుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ లుక్ చూసి ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. మరీ లీన్‌గా ఉన్నాడేంటని చర్చించుకుంటున్నారు.
Also Read : BaahubaliTheEpic : ‘బాహుబలి ది ఎపిక్’ దారిలో పుష్ప, KGF, పొన్నియన్ సెల్వన్
ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్. కానీ, ఎన్టీఆర్ ఇంతలా వెయిట్ లాస్ అయ్యాడంటే.. ఈసారి నీల్ ఏదైనా ప్రయోగం చేస్తున్నాడా? అనే సందేహాలు రాక మానదు. అయితే, ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే కీలక ఎపిసోడ్ కోసం ఎన్టీఆర్ బరువు తగ్గినట్టుగా చెబుతున్నారు. ఇందులోని పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా ఉంటాయని అంటున్నారు. ఎన్టీఆర్ లుక్ చాలా డిఫరెంట్ ఉంటుందని టాక్. ప్రస్తుతం అందుకు సంబంధించిన సీక్వెన్స్ షూట్ చేస్తున్నారట. అయితే, ఇక్కడ మరో వెర్షన్ ఏంటంటే.. లేటెస్ట్ లుక్‌తో రెండో వెర్షన్ తెరకెక్కిస్తున్నట్టుగా ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. మొన్నటి వరకు క్లీన్ షేవ్ లో కనిపించిన తారక్ ఇటీవల ఫుల్ బియర్డ్ తో కనిపిస్తున్నాడు. ప్రజెంట్ కనిపించే లుక్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసాడట నీల్. అలాగే ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ గురించి ఇండస్ట్రీలో గట్టిగా చెప్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఇటీవల షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. ఆ గాయం కారణంగా షూట్ కాస్త ఆలస్యంగా జరుగుతుందని మేకర్స్ చెప్పిన డేట్ కు సినిమా రాదని న్యూస్ టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది
