Balakrishna Speech About NTR at NTR Ghat: నేడు టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 101వ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు అంజలి ఘటించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సేవలను కొనియాడారు.
‘ఎన్టీఆర్ అంటే ఓ శక్తి. తెలుగువారికి ఆయన ఆరాధ్య దైవం. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ చదువుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత సినీ రంగంలోకి వచ్చారు. ఇండస్ట్రీలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకే పంథాలో వెళ్తున్న రాజకీయాలను ఆయన మార్చారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని దేశానికి చాటి చెప్పారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు’ అని బాలకృష్ణ అన్నారు.
Also Read: NKR21: కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ‘ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్’ చూశారా?
‘గతంలో రాజకీయాలంటే కొంతమందికే పరిమితమై ఉండేవి. ఎన్టీఆర్ వచ్చాక డాక్టర్లు, లాయర్లు, అభిమానులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అప్పటివరకు అధికారానికి దూరంగా ఉన్న బడుగు బలహీనవర్గాలకు పదవులు ఇచ్చారు. ఎన్టీఆర్ తన ప్రభుత్వంలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. పేద ప్రజల కోసం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు’ బాలయ్య బాబు ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య బాబు.. ఇక సినిమాలపై దృష్టిపెట్టానున్నారు. NBK 109లో బాలయ్య నటిస్తున్న విషయం తెలిసిందే.