Tarakaratna – NTR : బెంగుళూరులోని నారాయణ హృదయాలయా ఆస్పత్రిలో 23 రోజులుగా కొనఊపిరితో పోరాటం చేసిన నందమూరి తారకరత్న కన్నుమూశారు. తారకరత్న అకాల మరణంతో నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. నందమూరి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తారకరత్న 20 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీకి సంచలనంగా ఎంట్రీగా ఇచ్చారు. వచ్చీ రావడంతోనే ఒకే రోజు 9 సినిమాలకు సైన్ చేసి రికార్డు సృష్టించారు. ఏ హీరోకి ఈ రికార్డ్ సాధ్యం కాలేదు. తారకరత్న 2002లో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా ఏ హీరో ఆయన రికార్డ్‌ని బ్రేక్ చేయలేకపోయారు. తారకరత్న ప్రారంభించిన తొమ్మిది సినిమాలలో.. ఒకటో నెంబర్ కుర్రాడు, తారక్, భద్రాద్రి రాముడు, నో, యువరత్న లాంటి సినిమాలు విడుదల కాగా.. కొన్ని పూజా కార్యక్రమాలతోనే ఆగిపోయాయి. అయితే ఆయన ఎంత ఫాస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారో అంతే ఫాస్ట్ గా ఇండస్ట్రీ నుండి అవకాశాలు లేక కనుమరుగై పోయారు. ఈయన నటించిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత ఈయన నటించిన అన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి.
Read Also: Taraka Ratna: తారక రత్న అసలు పేరు ‘ఓబులేసు’ అని మీకు తెలుసా?
దీని తర్వాత రవిబాబు డైరెక్షన్లో వచ్చిన అమరావతి సినిమాలో విలన్ గా కూడా నటించారు. ఇక ఈ సినిమాలో ఈయన నటనకు నంది అవార్డు లభించింది. ఇక ఈ సినిమా తర్వాత తారకరత్నకు అవకాశాలు కరువయ్యాయి. ఆ తర్వాత ఆయన ఫ్యామిలీకి ఇష్టం లేని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని కుటుంబానికి దూరమయ్యాడు. ఆ సమయంలోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట తారకరత్న. కనీసం తన పిల్లల అవసరాలు కూడా తీర్చలేక పోయాడని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మినిట్ ఆయన అన్నకు సహాయం చేయడానికి.. ఎవరికీ తెలియకుండా రహస్యంగా తారకరత్నకు నెలకు నాలుగు లక్షల రూపాయలకు పైగానే అమౌంట్ పంపిస్తున్నారు అంటూ అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు ఒకానొక సందర్భంలో తారకరత్న ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ‘ఈరోజు మా ఫ్యామిలీ ఇలా ఉండడానికి కారణం ఎన్టీఆర్..నా తమ్ముడు లేకపోతే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. నా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా తమ్ముడు నాకు అండగా నిలబడి నన్ను రక్షించాడు అంటూ ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు’.