NTR Fan Raju: ఎన్టీఆర్ వీరాభిమాని ‘ఎన్టీఆర్ రాజు’ ఇకలేరు!
- ఎన్టీఆర్ వీరాభిమాని ఎన్టీఆర్ రాజు ఇకలేరు
- బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన రామచంద్రరాజు
- ఎన్టీఆర్ రాజు మృతికి సంతాపం వ్యక్తం చేసిన బాలయ్య బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ వీరాభిమాని, టీడీపీ సీనియర్ నాయకులు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు రామచంద్రరాజు (ఎన్టీఆర్ రాజు) ఈరోజు ఉదయం కన్నుమూశారు. తిరుపతిలోని తన నివాసంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్టీఆర్ రాజు మరణంతో టీడీపీలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మృతిపట్ల సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు.
మహానేత ఎన్టీఆర్ గారిపై ఉన్న అపారమైన అభిమానంతో ఆయన పేరునే రామచంద్రరాజు తన ఇంటిపేరుగా (ఎన్టీఆర్ రాజు) మార్చుకుని నిజమైన వీరాభిమాని అనిపించుకున్నారు. రెండు పర్యాయాలు టీటీడీ బోర్డు సభ్యులుగా ఎంతో అంకితభావంతో సేవలందించారు. ఎన్టీఆర్‌కి ఆల్ ఇండియా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి.. పార్టీకి, ప్రజలకు నిస్వార్థంగా సేవలందించారు. శాసనసభ సభ్యునిగా అవకాశం వచ్చినా.. ఎన్టీఆర్ అభిమాని గానే ఉంటా అని చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. ఆచరణతోనే ఆదర్శంగా నిలిచిన ఎన్టీఆర్ రాజు జీవితం.. తరతరాల వారికి మార్గదర్శకంగా నిలుస్తుంది.
Also Read
- FIFA World Cup 2026: 'ఉండావ్' డబుల్ ధమాకా.. ఐవరీ కోస్ట్‌పై జర్మనీ అద్భుత విజయం.. ప్రీక్వార్టర్స్‌లోకి అడుగు.!
- International Yoga Day: 12 ఏళ్లు పూర్తి.. అసలు జూన్ 21నే యోగా డే ఎందుకు జరుపుకుంటారు? చరిత్ర ఇదే!
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
- IND W vs SA W: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు కీలక పోరు.. దక్షిణాఫ్రికాపై హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి.!
Also Read: SRH Team 2026: మాన్స్టర్ వచ్చేశాడు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత మారేనా?
ఎన్టీఆర్ రాజు మరణంపై సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం ప్రకటించారు. ‘తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అన్న ఎన్టీఆర్ గారి వీరాభిమాని, మూడు సార్లు టీటీడీ బోర్డు సభ్యులుగా అన్నగారు నియమించిన పెద్దలు శ్రీ రామచంద్రరాజు (ఎన్టీఆర్ రాజు) గారు ఇవాళ ఉదయం కన్నుమూశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
FIFA World Cup 2026: ‘ఉండావ్’ డబుల్ ధమాకా.. ఐవరీ కోస్ట్‌పై జర్మనీ అద్భుత విజయం.. ప్రీక్వార్టర్స్‌లోకి అడుగు.!
-
International Yoga Day: 12 ఏళ్లు పూర్తి.. అసలు జూన్ 21నే యోగా డే ఎందుకు జరుపుకుంటారు? చరిత్ర ఇదే!
-
CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
-
NEET UG Re Exam 2026: నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్.. 1.3 లక్షల సీసీటీవీ కెమెరాలు, 51 వేల జామ్మర్లతో భద్రతా ఏర్పాట్లు
-
Prasidh Krishna: బుమ్రా, భువికి కూడా సాధ్యంకాలేదు.. చెపాక్ లో కిట్టు గాడి కాకరేపే రికార్డు!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!