Site icon NTV Telugu

NTR District: పోలీసింగ్ కోసం సాంకేతికత అందుబాటులోకి తెచ్చిన పోలీసులు..

Cp

Cp

పోలీసింగ్ కోసం సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. ఈ క్రమంలో ఇ-పహారా అప్లికేషన్ ను పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర పరిధిలో నేర చరిత్ర కలిగిన వారి ఇళ్లను జియో ట్యాగ్ చేశామని తెలిపారు. బీట్ సిస్టమ్ను రివ్యూ చేశాం.. డిజిటల్ బీట్ సిస్టమ్ను రూపొందించామని సీపీ చెప్పారు. అంతేకాకుండా.. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను పునరుద్ధరించామని అన్నారు. చోరీలు, దొంగతనాలను కట్టడి చేస్తామని తెలిపారు.

Read Also: Mahrang Baloch: బలూచిస్తాన్‌ కోసం.. ఒక్క మహిళ పాకిస్తాన్‌ని వణికిస్తోంది..

జైల్ మానిటరింగ్ సిస్టమ్ను అమలు చేస్తున్నామని సీపీ రాజశేఖర్ బాబు చెప్పారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పై ప్రత్యేక దృష్టి సారించామని.. ట్రాఫిక్ నియంత్రణ పై సర్వే చేసిన సంస్థల సహకారం తీసుకుంటున్నామన్నారు. పైలట్ ప్రాజెక్ట్లో ఏ టైమ్లో ఎక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటుందో గుర్తించామని తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణ పై ప్రత్యేకంగా దృష్టిపెట్టామని.. సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించేందుకు వీడియో కాంటెస్ట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సైబర్ సేఫ్టీ, నిందిత కేంద్రీకృత స్త్రీలు & పిల్లల భద్రత, రోడ్డు భద్రత విభాగాలపై వీడియో కాంటెస్ట్ చేస్తామని సీపీ తెలిపారు.

Read Also: TFPC Key Meeting: 8 వారాల తర్వాతే ఓటీటీలోకి.. తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం

Exit mobile version