Site icon NTV Telugu

Collector Dilli Rao: కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి.. ప్రత్యేక నిఘా కెమెరాలు ఏర్పాటు

Dilli Rao

Dilli Rao

Collector Dilli Rao: ఎన్టీఆర్ జిల్లాలో కౌంటింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీ రావు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి రాష్ట్ర పోలీసులకు అనుమతి లేదని, కేవలం సీఆర్పీఎఫ్ పోలీసులు మాత్రమే ఉంటారన్నారు.

Read Also: Chandrababu: కౌంటింగ్ ఏర్పాట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.

సాయంత్రం నాలుగు గంటలకల్లా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. 6 గంటలకు అలా అభ్యర్థులకు డిక్లరేషన్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖల వారికి ఏర్పాట్లు చేశామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ విడివిడిగా కౌంటింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఒకపక్క పోస్టల్ బ్యాలెట్, మరోవైపు ఈవీఎంల కౌంటింగ్ ఏకకాలంలో జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎవరి సెల్ ఫోన్స్ అనుమతించమన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మీడియా సిబ్బందికి, అభ్యర్థులకు, ముఖ్యమైన కౌంటింగ్ సిబ్బందికి పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. సర్వీస్ ఓట్ల విషయంలో ఎన్టీఆర్ జిల్లాలో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు.

Exit mobile version