Site icon NTV Telugu

Amaravati R5 Zone: ఆర్5 జోన్ లో పట్టాల పంపిణీకి రంగం సిద్ధం

Delhi Rao S

Delhi Rao S

అమరావతి R5 జోనులో పేదలకు ఈ నెల 18 నాటికి ఇంటి పట్టా ఇచ్చేందుకు పని చేస్తున్నాం అన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. ఎన్టీఆర్ జిల్లా నుంచి మొత్తం 20684 మంది లబ్ధిదారులు ఉన్నారు. లబ్ధిదారులకు గతంలో ఇచ్చిన హామీ పత్రాలను మళ్లీ రీ సర్వే చేయించాం. రీ సర్వేలో అందుబాటులోకి రాని, చనిపోయిన వారిని పక్కన పెట్టాం. ఇలాంటి వాళ్ళు 5 వేల మందిలోపు ఉన్నారు. పట్టాల ప్రింటింగ్ కూడా పూర్తయింది. ఏ లే అవుట్ లో ఎవరు ఉన్నారో ఇప్పటికే గుర్తించాం అన్నారు కలెక్టర్ ఢిల్లీ రావు.

Read ALso: Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

ఎన్టీఆర్ జిల్లా వారి కోసం ఉన్న 11 లే అవుట్లలో 5 లే అవుట్లలో జంగిల్ క్లియరెన్స్, లెవెలింగ్ పూర్తయ్యాయి. మరో 6 లే అవుట్లలో ఈ పనులు 2 రోజుల్లో పూర్తవుతాయి. ఇంటి స్థలాల కోసం CRDA నుంచి 570 ఎకరాలు కేటాయించారు. మరో 95 ఎకరాలు అదనంగా కావాలని CRDAని కోరాం. రోడ్లు, మార్కింగ్, స్తోనింగ్ మాత్రం 2 వేలు ఫ్లాట్లకు పూర్తయ్యాయి. ఈ నెల 15కి మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. రోజుకి 120 మంది ప్రభుత్వ సిబ్బంది పట్టాల కోసం పని చేస్తున్నారు అని చెప్పారు కలెక్టర్ ఢిల్లీ రావు. ఇదిలా ఉంటే… R5 జోనులో ఇళ్ళపట్టాల అంశంలో సుప్రీంకోర్టు మెట్లెక్కారు అమరావతి రైతులు. ..హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని తమ పిటిషన్ లో కోరిన అమరావతి రైతులు…సీజేఐ బెంచ్ ముందు స్పెషల్ మెన్షన్ చేసిన రైతుల తరపు న్యాయవాది..వచ్చే వారం విచారణ చేస్తామని సీజేఐ తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు ఏం ఆదేశాలిస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Read Also: Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

Exit mobile version