Lakshmi Parvathi: సీఎం చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్!
- ఎన్టీఆర్ 29వ వర్ధంతి
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన లక్ష్మీ పార్వతి
- సీఎం చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి నివాళి అర్పించారు. నాయకుడిగా, సీఎంగా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. 29 ఏళ్లుగా ఎన్టీఆర్ దూరమై మనో వేదనకు గురవుతున్నానని తెలిపారు. లక్షలాది ప్రజలు చూస్తుండగా ఎన్టీఆర్ తనను వివాహం చేసుకున్నారని, తనను ఎందుకు నందమూరి కుటుంబ సభ్యురాలుగా చూడడం లేదు అని ప్రశ్నించారు. తనకు అవమానం జరుగుతుంటే సీఎం చంద్రబాబు ఇలానే చూస్తూ ఉంటారా? అని లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ… ’29 ఏళ్లుగా ఎన్టీఆర్ దూరమై మనో వేదనకు గురవుతున్నా. లక్షలాది ప్రజలు చూస్తుండగా.. ఎన్టీఆర్ నన్ను వివాహం చేసుకున్న విషయం మీకు తెలుసు. నన్ను ఎందుకు ఈ కుటుంబ సభ్యురాలుగా చూడడం లేదు. ఎన్టీఆర్ రాజకీయంగా అధికారంలోకి రావడంలో నా వంతు కృషి చేశాను. ఒక్క రూపాయి ఆశించకుండా చివరి వరకు ఆయనకు సేవలు చేశాను. నిన్న నా ఫోన్ నంబర్ ఎవరో టీడీపీ వాళ్లు సోషల్ మీడియాలో పెట్టారు. నిన్నటి నుండి వెయ్యికి పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. చూపించలేని అసభ్య మేసేజ్‌లు కూడా వస్తున్నాయి. మీరు అనుకున్నా, అనుకోకున్నా నేను మీ అత్తగారిని కదా చంద్రబాబు. ఇలాంటి అవమానం నాకు జరుగుతుంటే ఇలానే చూస్తూ ఉంటారా చంద్రబాబు?’ అని ప్రశ్నించారు.
Also Read
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
‘ఇన్నేళ్ళు డబ్బు ఉన్నా లేకున్నా ఎవరినీ చేయిచాచి అడగలేదు. ఎన్టీఆర్ గౌరవం కాపాడేలా బ్రతుకుతున్నాను. నామీద ఎందుకు మీకు కక్ష. అసలు నేనేమీ తప్పు చేశానో కూడా నాకు అర్ధం కావడం లేదు. ఎన్టీఆర్ పేరుతో మీరంతా లక్షలు కోట్లు సంపాదించారు. నాపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు. మహిళలను గౌరవించే అవసరం మీకు లేదా?’ అని లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!