Instagram Friendship: సోషల్ మీడియా వేదికగా ఇంస్టాగ్రామ్ ద్వారా మొదలైన పరిచయం ఇద్దరి జీవితాలను అర్ధాంతరంగా ముగిసేలా చేసింది. శ్రీకాళహస్తికి చెందిన యువకుడు సురేశ్, విశాఖపట్నానికి చెందిన వివాహిత పద్మ మధ్య ఇంస్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరి సంబంధం పెరిగి చివరకు.. పద్మ తన భర్త, పిల్లలను విడిచిపెట్టి శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీలో గత 9 నెలలుగా సురేశ్‌తో కాపురం చేస్తోంది. అయితే, ఈ దంపతుల మధ్య ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నట్టు సమాచారం.
Read Also: Tirumala Darshanam: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం..!
మూడు రోజుల క్రితం టిఫిన్, భోజనాన్ని వృథా చేస్తోందని సురేశ్ పద్మను మందలించడంతో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం భయంతో శవాన్ని కిందకు దించి, తాను విషం తాగానని సురేశ్ తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న సురేశ్, చివరకు ఆసుపత్రిలో మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంస్టాగ్రామ్‌లో మొదలైన పరిచయం.. చివరకు ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటనగా మారింది.
Read Also: NDA CMs Meeting: నేడు ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం.. కీలక అంశాలపై చర్చ..!