Free Current: అద్దె ఇంటిలో ఉన్నా కూడా ‘గృహ జ్యోతి’ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అర్హులని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మంగళవారం తెలిపారు. దీని కింద రాష్ట్రంలోని గృహ వినియోగదారులందరికీ జూలై 1 నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని సీఎం ప్రకటించారు. ఈ పథకం కింద ఉచిత విద్యుత్‌ను పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన ఒక రోజు తర్వాత స్పష్టత వచ్చింది. అద్దెకు జీవించే వారికి కూడా ఉచిత విద్యుత్ (200 యూనిట్లు) ఇస్తామని సిద్ధరామయ్య విలేకరులతో అన్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ ఖర్చు చేసే వారు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. అద్దెదారులు కూడా ‘గృహ జ్యోతి’ పథకం ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులు.
Read Also:Anasuya : అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య వివాదం ముగిసినట్టేనా..?
వాణిజ్య అవసరాలకు వినియోగించే విద్యుత్‌కు ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఐదు వాగ్దానాలలో ‘గృహ జ్యోతి’ పథకం ఒకటి. భారతీయ జనతా పార్టీ ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చలేదని, కర్ణాటకను మాత్రమే లూటీ చేసిందని నిరసన తెలిపే నైతిక హక్కు భారతీయ జనతా పార్టీకి లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. ఇక చేసేదేమీ లేనందునే బీజేపీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. వారికి ఎలాంటి నైతిక హక్కులు లేవని సిద్ధు ఆరోపించారు.
Read Also:CPI Ramakrishna : ప్రథమచికిత్సకు పూర్తిస్ధాయి గుర్తింపు అవసరం
10 గంటల ఉచిత విద్యుత్, వ్యవసాయ రుణమాఫీ, సాగునీటికి రూ. 1.5 లక్షల కోట్లు ఖర్చు చేయడం వంటి ఎన్నికల వాగ్దానాల్లో ఏ ఒక్కటీ బీజేపీ నెరవేర్చలేదని సిద్ధరామయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో యూనిట్‌కు రూ.2.89 చొప్పున విద్యుత్ ఛార్జీలను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిందని బీజేపీ విమర్శించింది. కాగా, రాష్ట్రంలో విద్యుత్ ధరలను యూనిట్‌కు రూ.2.89 పెంచిన తర్వాత పశుసంవర్థక శాఖ మంత్రి కె.కె. వెంకటేష్ చేసిన గోవు వ్యతిరేక ప్రకటనపై బీజేపీ నిరసన వ్యక్తం చేస్తోంది. బెంగళూరు, మైసూరు, దావణగెరె సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరుగుతున్నాయి.