Rajasthan: సామూహిక అత్యాచారం నగ్నంగా పరుగులు తీసిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gang Rape On Woman: మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వారిపై ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందో తెలయడం లేదు. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, ఎంత మంది పోలీసులు పహారా కాస్తున్న ఏదో ఓ మూల ఆడ పిల్ల అత్యాచారానికి గురవుతూనే ఉంది. కొన్ని సార్లు అందరూ ఉన్నా పట్టపగలు నడిరోడ్డుపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా వారిని అంతమొందిస్తున్నారు కూడా. తాజాగా వాకింగ్ చేస్తున్న మహిళను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేయడంతో ఆమె నగ్నంగా పరుగులు తీసింది. ఈ అమానవీయ ఘటన రాజస్తాన్ లో చోటు చేసుకుంది. అనంతరం నిందితులను పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
Also Read: Gold Price Today: గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
Also Read
వివరాల ప్రకారం రాజస్తాన్ లోని బిల్వారా ప్రాంతంలో ఉంటున్న మహళకు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తనను కలవాలని ఆ వ్యక్తి ఆమెను కోరాడు. అయితే అందుకు ఆ మహిళ నిరాకరించింది. సాయంత్రం ఎప్పటి లాగానే ఆ మహిళ ఏడు గంటల ప్రాంతంలో వాకింగ్ కు వెళ్లింది. మొదటి నుంచి ఆమెను ఫాలో అవుతున్న ఇద్దరు వ్యక్తులు ఆమెను లాకెళ్లి సామూహిక అత్యాచారానిక పాల్పడ్డారు. అయితే వారి దగ్గర నుంచి తప్పించుకున్న మహిళ నగ్నంగానే రోడ్డుపై పరుగులు పెట్టింది. అలా పరిగెత్తుకుంటూ ఆమె పక్కనే ఉన్న గ్రామాన్ని చేరుకుంది. ఆ గ్రామస్థులు ఆ మహిళకు బట్టలు ఇచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాలి వద్ద జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆమెను రేప్ చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఓ ద్విచక్రవాహనాన్ని, పగిలిన ఆమె చేతి గాజు ముక్కలను పోలీసులు గుర్తించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందుతులను చోటు, గిరిధర్ లుగా గుర్తించి వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!