NTV Telugu Site icon

Nagarjuna–Konda Surekha: నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కొండా సురేఖకు నోటీసులు..

Surekha Nagarjuna

Surekha Nagarjuna

మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు.. హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం పిటీషన్ పై నేడు విచారణ జరిగింది. తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున పరువు నష్టం కేసు వేశాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిగిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసి.. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. ఈనెల 8వ తేదీన పిటిషన్ దారుడు నాగార్జున, సాక్షిగా ఉన్న సుప్రియల స్టేట్మెంట్ రికార్డు చేసింది కోర్టు.

Read Also: Manchu Vishnu: మంచు విష్ణుకి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ తొలగించాలి!

కాగా.. ఈ నెల 23వ తేదీన మంత్రి కొండా సురేఖకు సంబంధించిన న్యాయవాదులు నోటీసులకు సంబంధించి రిప్లై ఇవ్వవలసి ఉంటుంది. రిప్లైకు సంబంధించి కోర్టు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందితే.. ఆ తర్వాత విచారణ చేపడుతుంది. లేదంటే.. మంత్రి కొండా సురేఖ కోర్టుకు వచ్చి తన స్టేట్ మెంట్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించిన అంశంలో మూడో సాక్షిగా వెంకటేశ్వర్లను ఉంచుకోవడం జరిగింది. ఈ రోజు జరిగిన విచారణలో కేవలం సుప్రియ సాక్షి వరకూ చాలంటూ.. మిగతా వాదనలు కోర్టు పూర్తి స్థాయిలో వినింది. అనంతరం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది.

Read Also: Ratan Naval Tata: రతన్‌టాటాకు మాజీ పీఎంకి మధ్య ఘర్షణ.. రాజీనామా స్థాయికి చేరిన అంశం!

Show comments