Nothing phone 3a: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నథింగ్ ఫోన్ 3a సిరీస్ ఎట్టకేలకు భారత మార్కెట్‌లో విడుదలైంది. ఈ సిరీస్‌లో నథింగ్ ఫోన్ 3a, నథింగ్ ఫోన్ 3a ప్రో మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. నథింగ్ ఫోన్ 3a మొబైల్ సరికొత్త ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో యువతను ఆకర్షించేలా రూపొందుకుంది. ఇక నథింగ్ ఫోన్ 3a స్పెసిఫికేషన్లు, ఫీచర్ల విషయానికి వస్తే..
Read Also: Pralhad Joshi: కేంద్రమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
నథింగ్ ఫోన్ 3a మోడల్ 4nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ పై పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత NothingOS 3.1 (Skin On Top) తో పనిచేస్తుంది. ఈ ఫోన్ కు 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని నథింగ్ సంస్థ తెలిపింది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో 6.77 అంగుళాల FHD+ (1080*2392 పిక్సల్స్) అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 1000Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz PWM సపోర్ట్ అందిస్తోంది. ఈ డిస్‌ప్లే ‘పాండా’ గ్లాస్ రక్షణతో వస్తోంది.
నథింగ్ ఫోన్ 3a 5000mAh బ్యాటరీతో వస్తోంది. ఈ మొబైల్ కు ఏకంగా 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. దీనితో కేవలం 19 నిమిషాల్లో 50% ఛార్జింగ్ చేయవచ్చు. అలాగే 56 నిమిషాల్లో 100% ఛార్జింగ్ ను పూర్తి చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఇక కెమెరా పరంగా చూస్తే ఇందులో.. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో ప్రైమరీ కెమెరాగా 50MP శాంసంగ్ 1/1.57 అంగుళాల కెమెరా, f/1.88 అపేచర్, OIS, EIS సపోర్ట్ తో వస్తుంది. ఇక సెకండరీ కెమెరాగా 50MP సోనీ కెమెరా, f/2.0 అపేచర్, EIS, 2x ఆప్టికల్, 30x డిజిటల్ జూమ్ కలిగి ఉంది. ఇక మరో అల్ట్రావైడ్ కెమెరా 8MP సోనీ కెమెరాను అందిస్తోంది. ఇక 32MP కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో అందుబాటులో ఉంది.
Power in perspective.
Phone (3a) and Phone (3a) Pro. Two new signatures. Each refined to capture masterful shots.
Pre-order now. pic.twitter.com/2wYuV3eE84
— Nothing (@nothing) March 4, 2025
ఇక ఇతర కనెక్టివిటీ, ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టు సపోర్ట్ తో వస్తోంది. గ్లిఫ్ ఇంటర్‌ఫేస్, 10 కొత్త రింగ్‌టోన్స్, నోటిఫికేషన్ సౌండ్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. అలాగే భద్రత కోసం IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గుణం, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఇక చివరగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.24,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.26,999 లకు లభిస్తుంది. ఈ ఫోన్స్ సంబంధించి మార్చి 11న ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్, క్రోమా వంటి స్టోర్స్‌లో కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు కార్డులపై ప్రత్యేక డిస్కౌంట్‌లను పొందే అవకాశం ఉంది.