NTV Telugu Site icon

Nothing Phone 3a: భారీ డిస్కౌంట్తో నేటి నుంచి అమ్మకాలు షురూ చేయనున్న నథింగ్‌ ఫోన్ 3a సిరీస్‌

Nothing Phone 3a

Nothing Phone 3a

Nothing Phone 3a: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో నూతన మోడళ్ల లాంచ్‌ వేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ బ్రాండ్ ‘నథింగ్‌’ తన కొత్త నథింగ్ ఫోన్ 3a సిరీస్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో నథింగ్ ఫోన్ 3a, నథింగ్ ఫోన్ 3a Pro మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. నేడు (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ రెండు వేరియంట్స్‌ సేల్‌ ప్రారంభం కానుంది. ఈ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్లతో కూడిన ప్రత్యేకమైన డిస్కౌంట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Read also: Telegram Update: ఇకపై టెలిగ్రామ్‌లో స్పామ్ కాల్స్, మెసేజ్‌లకు బ్రేక్.. కొత్త అప్డేట్స్ ఇవే!

ఇక ఈ మొబైల్స్ ధర, వాటి ఉన్న ఆఫర్స్ ను చూస్తే..

* నథింగ్ ఫోన్ 3a:

8GB + 128GB – – రూ.24,999

8GB + 256GB – – రూ.26,999

* నథింగ్ ఫోన్ 3a Pro:

8GB + 128GB – – రూ.29,999

8GB + 256GB – – రూ.31,999

12GB + 256GB – – రూ.33,999

Read also: Russia-Ukraine: శాంతి చర్చల వేళ మరోసారి ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులు

ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారికి HDFC బ్యాంకు డెబిట్/క్రెడిట్ కార్డులపై గరిష్టంగా రూ. 1500 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డుల EMI ట్రాన్సాక్షన్‌లపై రూ.2000 తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5% డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఇక నథింగ్ ఫోన్ 3a మొబైల్ బ్లాక్, బ్లూ, వైట్ రంగులలో అందుబాటులో ఉంటుంది. అలాగే నథింగ్ ఫోన్ 3a Pro మోడల్ బ్లాక్, గ్రే రంగులలో అందుబాటులో ఉంటుంది.

ఇక ఈ నథింగ్ ఫోన్ 3a ఫీచర్లను చూస్తే.. ఇందులో 120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌ కలిగిన 6.77-అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లే తో వస్తోంది. ఇది 4nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఇందులో Android 15 ఆధారిత NothingOS 3.1 అందించబడింది. ఇంకా కెమెరా సెటప్ గమనించినట్లయితే.. 50MP శాంసంగ్‌ ప్రైమరీ కెమెరా, 50MP సోనీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాతో పాటు, 32MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ లో 5000mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.

మరోవైపు నథింగ్ ఫోన్ 3a Pro ఫీచర్లను చూస్తే.. ఇందులో 6.77-అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లే తో వస్తుంది. ఇది 4nm ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 SoC చిప్‌సెట్‌తో వస్తుంది. ఇందులో కూడా కెమెరాను గమనించినట్లతే.. 50MP శాంసంగ్ ప్రైమరీ కెమెరా, 50MP సోనీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ లతోపాటు 50MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. ఇక బ్యాటరీ, ఛార్జింగ్ విషయానికి వస్తే.. 5000mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇంకా ఇతర ఫీచర్లు, కనెక్టివిటీ విషయానికి వస్తే.. 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్ట్, గ్లిఫ్‌ టైమర్, వాల్యూమ్ ఇండికేటర్, గ్లిఫ్‌ కంపోజర్, గ్లిఫ్‌ టార్చ్, గ్లిఫ్‌ ప్రోగ్రెస్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్, IP64 రేటింగ్ – డస్ట్, వాటర్ రెసిస్టెంట్ లాంటివి అందుబాటులో ఉన్నాయి.