Nothing Phone 2a might launch 2024 February: లండన్‌కు చెందిన కన్స్యూమర్ టెక్ కంపెనీ ‘నథింగ్’ కేవలం రెండు సంవత్సరాలలో మార్కెట్‌లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇప్పటివరకు వచ్చిన రెండు స్మార్ట్‌ఫోన్‌లు నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2లకు మంచి స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు నథింగ్ ఫోన్ 2కు కొనసాగింపుగా నథింగ్ ఫోన్ 2ఏను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. ఫిబ్రవరి 27న జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) వేదికగా నథింగ్ ఫోన్ 2ఏ లాంచ్ కానుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
నిజానికి నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ టెస్టింగ్ దశలో ఉందని కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. అయితే ఈ ఫోన్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంటుందని భావిస్తున్నారు. కరెన్సీలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ. 33,000 ఉంటుందని అంచనా. నథింగ్ ఫోన్ 2ఏలో 120 హెచ్‌జడ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంటుందట. ఈ ఫోన్ 6.7 ఇంచ్ ప్యానెల్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200ఎస్ఓసీ చిప్‌సెట్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ కలిగి ఉండనుంది.
Also Read: KL Rahul: ఆటను ఆస్వాదించండి.. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వండి: భారత్ కెప్టెన్
నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ వెనుకభాగంలో రెండు కెమెరాలు ఉండనున్నాయి. ఇందులో ఒకటి 50 ఎంపీ కెమెరా ఉంటుందని టెక్ నిపుణుల అంచనా వేస్తున్నారు. సాధారణ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. మరికొన్ని రోజుల్లో పూర్తి వివరాలు తెలియరానున్నాయి. నథింగ్ ఫోన్ 2a కాకుండా కంపెనీ తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ ‘నథింగ్ ఫోన్ 3’ని ఎంపిక చేసిన ప్రాంతాలలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయట.