NTV Telugu Site icon

Nothing Phone (2) Launch 2023: ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (2) ప్రీ ఆర్డర్‌ పాస్‌.. ఫోన్ నచ్చకుంటే మొత్తం రిఫండ్‌!

Nothing Phone (2)

Nothing Phone (2)

Nothing Phone (2) Launch Date and Price in India 2023: నథింగ్‌ ఫోన్‌ (1)కి భారత మార్కెట్లో డిమాండ్‌ పెరగడంతో కంపెనీ మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. నథింగ్‌ ఫోన్‌ (2)ని రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. 2023 జూలై 11న అధికారికంగా భారతదేశంలో నథింగ్‌ ఫోన్‌ (2)ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. అయితే అధికారిక లాంచింగ్‌ కన్నా ముందే ఈ ఫోన్ కోసం కంపెనీ ప్రీ-ఆర్డర్‌లను తీసుకోనుంది. భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్‌లను ఉంచింది.

నథింగ్‌ ఫోన్‌ (2) స్మార్ట్‌ఫోన్‌ కోసం ప్రీ ఆర్డర్‌ పాస్‌ను (Nothing Phone (2) Pre-order Pass) అందుబాటులో ఉంచింది. రూ. 2000లతో ఈ ప్రీ ఆర్డర్‌ పాస్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రీ ఆర్డర్‌ పాస్‌ను కొనుగోలు చేస్తే.. నథింగ్‌ ఫోన్‌ (2) ఫోన్‌ మిగిలిన వారి కంటే ముందుగానే మీకు డెలివరీ అవుతుంది. ఒకవేళ మీరు ఈ ఫోన్‌ కొన్ని రోజులు వాడాక నచ్చకపోతే రిటర్న్‌ కూడా చేసేయొచ్చు. అప్పుడు మీకు మొత్తం నగదు చెల్లిస్తారు. జూలై 11న ఈ ఫోన్ లాంచ్‌ అయిన తర్వాత జూలై 20 వరకూ కొనుగోలు చేసేందుకు అవకాశం ఇస్తారు. ఒకవేళ ప్రీ ఆర్డర్‌ చేసి.. ఫోన్‌ కొనుగోలు చేయకపోయినా ఆ నగదు కూడా వస్తుంది.

Also Read: 2024 Hyundai Creta: సరికొత్త హ్యుందాయ్ క్రెటా ఫొటోస్ లీక్.. మార్పులు ఏంటంటే?

నథింగ్‌ ఫోన్‌ (2) స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఉపకరణాల కొనుగోలుపై 50% తగ్గింపు ఆఫర్లు ఉంటాయి. రూ. 8,499 విలువైన నథింగ్ ఇయర్ (స్టిక్)ను మీరు ఆఫర్‌లో రూ. 4,250కే సొంతం చేసుకోవచ్చు. రూ. 1,299 విలువైన నథింగ్‌ ఫోన్ (2) కేస్‌ను రూ. 499కే సొంతం చేసుకోవచ్చు. వినియోగదారులు రూ. 999 విలువైన నథింగ్ స్క్రీన్ ప్రొటెక్టర్‌ను రూ. 399కి.. 45W నథింగ్ ఛార్జర్‌ను రూ. 2,499కి బదులు రూ. 1,499కే కొనుగోలు చేయొచ్చు.

నథింగ్ ఫోన్ (2)లో స్నాప్‌డ్రాగన్ 8+ జెన్‌ 1 ఎస్‌ఓసీపై ఆధారపడి పనిచేస్తుంది. ఇందులో 4,700 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు 45W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఐఫోన్ 12 ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్ ద్వారా ప్రేరణ పొందిన చివరి జెన్-మోడల్ మాదిరిగానే దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇది కొత్త లైట్/సౌండ్ సిస్టమ్‌తో వెనుకవైపు భిన్నమైన డిజైన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లే, 120హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఇది మొదటి-తరం మోడల్‌ను పోలి ఉంటుంది. స్పెసిఫికేషన్లు, డిజైన్ ప్రకారం చూస్తే.. దీని ధర రూ. 40,000పైనే ఉంటుందని అంచనా.

Also Read: ODI Worldcup 2023: ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోవడం సిగ్గుచేటు: సెహ్వాగ్‌

Show comments