NTV Telugu Site icon

Fadnavis: వ్యూహం మార్చిన ఫడ్నవీస్.. మహా ఎన్నికలే టార్గెట్!

Fad

Fad

మహారాష్ట్ర బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోవడం.. తక్కువ సీట్లు రావడంతో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాకు సిద్ధమయ్యారు. అయితే శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశం తర్వాత ఫడ్నవీస్.. తన ఆలోచనను మార్చుకున్నారు. రాజీనామాపై అమిత్ షాతో ఫడ్నవీస్ చర్చించారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్‌కు పలు సూచనలు చేశారు. హస్తినలో చర్చలు తర్వాత రాజీనామాపై ఫడ్నవీస్ ఆలోచన మార్చుకున్నారు. తాజాగా రాజీనామా చేయడం లేదని ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Ramoji Rao: రామోజీరావు అంత్యక్రియలకు ఏపీ తరఫున ముగ్గురు సీనియరు అధికారులు

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 23 స్థానాలు గెలిస్తే.. తాజా ఫలితాల్లో 9 స్థానాలే గెలుచుకుంది. దీంతో దీనికి బాధ్యత వహిస్తూ ఫడ్నవీస్ రాజీనామాకు సిద్ధమయ్యారు. కానీ అమిత్ షా బుజ్జగింపులతో మెత్తబడ్డారు. రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున తానే నాయకత్వం వహించినట్లు తెలిపారు. ఓటమికి కూడా తానే బాధ్యత వహిస్తానని చెప్పారు. రాజీనామాకు అనుమతించాలని కోరాను. కానీ త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పని చేసుకుంటూ సాగిపోవాలని అమిత్ షా చెప్పారన్నారు. తనపై అధిష్టానం విశ్వాసం ఉంచిందని చెప్పుకొచ్చారు. అక్టోబరులో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించి.. ముందుకు సాగిపోవాలని అమిత్ షా చెప్పినట్లు ఫడ్నవిస్ పేర్కొన్నారు. అందుకోసమే రాజీనామా నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: IBPS RRB 2024: 10వేల ఉద్యోగాలు రెడీ.. దరఖాస్తు చేసుకోండి ఇలా..

మహారాష్ట్రలో 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమి కేవలం 17 స్థానాలే గెలుచుకుంది. మిగతా స్థానాలు విపక్ష కూటమి ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. కేవలం 2 లక్షల ఓట్ల తేడాతోనే ఈ మార్పు జరగడం విశేషం. విపక్షాల తప్పుడు ప్రచారంతోనే సీట్లు తగ్గాయని ఫడ్నవీస్ ఆరోపించారు. మోడీ అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని మార్చేస్తారన్న తప్పుడు ప్రచారంతోనే సీట్లు తగ్గాయని ఫడ్నవీస్ పేర్కొన్నారు.