Site icon NTV Telugu

Delhi Hotel: మాములోడు కాదు.. రెండేళ్లు ఫైవ్ స్టార్ హోటల్లో ఉండి.. బిల్లు కట్టకుండానే జంప్..!

5 Star

5 Star

Delhi Hotel: మనం సాధారణంగా హోటల్ కు వెళ్తే.. మనం ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ ఐటమ్స్ తిని బిల్లు కట్టి వచ్చేస్తాం. లేదంటే హోటల్ యాజమన్యం మనల్ని డబ్బులు ఇచ్చేదాకా వదలిపెట్టదు. అలాంటిది ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఓ వ్యక్తి బిల్లు కట్టకుండా బయటపడ్డాడు. సరే లే అని వదిలిపెట్టేద్దాం అనుకుంటే.. ఒక్క రోజా రెండు రోజులా ఉండలేదు. దాదాపు 603 రోజులు ఉండి డబ్బులు కట్టకుండానే ఉడాయించాడు. అక్షరాల రూ.58 లక్షల బిల్ ఎగ్గొట్టాడు ఈ చీటర్.

Read Also: SBI: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఎస్బీఐ.. ఆగస్టు 15 వరకు అవకాశం..

ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టుకి దగ్గర్లో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ లో అంకుశ్ దత్త అనే వ్యక్తి 2019 మే 30వ తేదీన ఫస్ట్ టైమ్ దిగాడు. ఒక్కరాత్రికి బుక్ చేసుకున్న ఆ వ్యక్తి.. మరుసటి రోజు చెకౌట్ చేయాలి. కానీ అప్పటినుంచి ఎక్స్ టెండ్ చేస్తూ.. 2021 జనవరి 22 వరకూ అక్కడే ఉన్నాడు. అయితే హోటల్‌కి ఎవరు వచ్చినా 72 గంటల్లో బిల్ కట్టకపోతే.. ఆ విషయం వెంటనే సీఈవో వరకూ వెళ్తుంది. అయితే.. ఫ్రంట్ ఆఫీస్ హెడ్ మాత్రం ఇది ఎవరి దృష్టికీ వెళ్లకుండా మేనేజ్ చేశాడు. మరో ట్విస్ట్ ఏంటంటే.. నిందితుడు దత్త హోటల్‌కి మొత్తం మూడు చెక్స్ ఇచ్చాడు. రూ.10 లక్షలు, రూ.7 లక్షలు, రూ.20 లక్షల చెక్‌లు ఇవ్వగా.. అవన్నీ బౌన్స్ అయ్యాయి. ఆ విషయం కూడా పై అధికారులకు తెలియదు.

Read Also: Ambati Rambabu: పవన్ వారాహి మీద కాదు పంది మీద ఎక్కాడు.. 420లా తయారయ్యాడు.. మంత్రి సంచలనం!

మరోవైపు ఆ చీటర్ పారిపోవడానికి హోటల్‌ ఫ్రంట్ ఆఫీస్ హెడ్ ప్రేమ్ ప్రకాశ్.. సహకరించినట్టు హోటల్ ఓనర్ ఆరోపించాడు. హోటల్‌లో ఎవరెవరు ఉంటారన్నా విషయం..? ఎవరెవరికి యాక్సెస్ ఉంది అనేది పూర్తిగా ప్రేమ్ ప్రకాశ్ కు తెలుస్తుందన్నాడు. అతని సహకారం లేకుండా నిందితుడు అన్ని రోజులు హోటల్‌లో ఉండే అవకాశమే లేదని చెబుతున్నాడు. ఓవర్‌ స్టే చేసేందుకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఉంటాడని అనుమానిస్తున్నాడు. అంతేకాకుండా ఎవరికి తెలియకుండా హోటల్ సాఫ్ట్‌వేర్‌ని కూడా తన ఆధీనంలో ఉంచుకొని.. ఈ నేరానికి పాల్పడ్డారని చెబుతున్నాడు హోటల్ యజమాని మల్హోత్రా. అయితే ఈ ఇద్దరి నిందితులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని హోటల్ యాజమాన్యం చూస్తోంది. ప్రాథమిక విచారణలో నిందితులెవరో గుర్తించామని, విచారణ పూర్తైన తరవాత తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Exit mobile version