Site icon NTV Telugu

Rahul Gandhi : పార్లమెంట్లో మాట్లాడే అవకాశం రాకపోవచ్చు

Rahul

Rahul

Rahul Gandhi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో తనను మాట్లాడేందుకు అనుమతి వచ్చేలా కనిపించడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం తమాషాలు చేస్తుందని విమర్శించారు. గురువారం పార్లమెంటు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంగ్లండ్ లో పర్యటనలో భాగంగా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌ స్పందించారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు పార్లమెంట్ లో తనకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. రాహుల్ వ్యాఖ్యలను నిరసిస్తూ తాజాగా పార్లమెంట్‌లో అధికార పార్టీ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాను పార్లమెంటు సభ్యుడినని, పార్లమెంటులో తన వాదన వినిపించేందుకు అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Read Also: Flight Cockpit : విమానం కాక్‌పిట్‌లో కజ్జికాయలు, కూల్‌డ్రింక్స్

‘ఈ విషయంలో నా వాదన వినిపించాలని నేను పార్లమెంట్ కు వెళ్లాను. నలుగురు మంత్రులు పార్లమెంట్‌లో నాపై ఆరోపణలు చేశారు. సభా వేదికపై మాట్లాడేందుకు అనుమతి పొందడం నా హక్కు. నాకు అవకాశం ఇవ్వాలని ఈ రోజు స్పీకర్‌ని అభ్యర్థించాను. నేను మాట్లాడాల్సిన అవసరం ఉందని ఆయన ఛాంబర్‌కి వెళ్లి చెప్పాను. బీజేపీకి చెందిన పలువురు నాపై ఆరోపణలు చేశారని, వాటికి సమాధానం ఇచ్చేందుకు సభలో మాట్లాడటం ఒక పార్లమెంటు సభ్యునిగా నా హక్కు అని చెప్పాను. కానీ, స్పీకర్ సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ వెళ్లిపోయారు. కానీ మాట్లాడటానికి రేపు అనుమతిస్తారని ఆశిస్తున్నా’ అని రాహుల్ పేర్కొన్నారు.

Read Also: Parliament : పార్లమెంటులో మైక్‌లను ఎవరు ఆన్ – ఆఫ్ చేస్తారో తెలుసా?

Exit mobile version