NTV Telugu Site icon

North Korea Balloons: చెత్తతో కూడిన బెలూన్ల వేసిన ఉత్తర కొరియా.. సౌత్ కొరియా మాస్ వార్నింగ్..!

North Korea

North Korea

North Korea: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. గతంలో ఇరు దేశాలు క్షిపణులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునేవారు. అయితే ఇప్పుడు చెత్తతో నిండిన బెలూన్లతో ఇరు దేశాలు పరస్పరం స్పందిస్తున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి దక్షిణ కొరియా మీద నార్త్ కొరియా నిరంతరం చెత్తతో నిండిన వందలాది బెలూన్‌లను పంపింది. ఇక, దక్షిణ కొరియాలోని ప్యోంగ్యాంగ్ లో కొందరు కార్యకర్తలు సరిహద్దు వెంబడి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు వ్యతిరేకంగా కరపత్రాలను కలిగి ఉన్న బెలూన్‌లను విడుదల చేశారని సియోల్ మిలిటరీ తెలిపింది. ఉత్తర కొరియా నుంచి వస్తున్న ఈ కొత్త తరహా దాడికి అప్రమత్తంగా ఉన్నా్ం.. ప్రతీకారంగా మరోసారి బెలూన్లతో దాడులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని దక్షిణ కొరియా తెలిపింది.

Read Also: Rohit Sharma: ఇది ప్రారంభం మాత్రమే.. ఇంకా చాలా ఉంది: రోహిత్

కాగా, ఉత్తర కొరియా మళ్లీ చెత్తను మోసుకెళ్లే బెలూన్‌లను దక్షిణాది వైపు ప్రయోగిస్తోందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. బెలూన్‌లు కనిపిస్తే అధికారులకు తెలియజేయాలి.. వాటిని తాకకుండా చూడాలని ప్రజలకు సూచించారు. అలాగే, దక్షిణ కొరియా కూడా ఇప్పుడు కొత్త మార్గంలో ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఉత్తర కొరియా సరిహద్దులో లౌడ్ స్పీకర్లను అమర్చడంతో పాటు కిమ్ జోంగ్ ఉన్ చేస్తున్న దారుణాలపై ప్రచారం చేయాలని పేర్కొనింది. ఇక, దక్షిణ కొరియా తీసుకున్న ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చే అవకాశం ఉందన్నారు.