NTV Telugu Site icon

North Korea: అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ సైనిక విన్యాసాలు.. నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం..!

North Koria

North Koria

North Korea: ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం దక్షిణ కొరియా, జపాన్‌, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా తీవ్రంగా ఖండించింది. వాటిని నాటో ఆసియా వెర్షన్‌ గా అభివర్ణించింది. అవి ప్రమాదకరమైన పరిణామాలుగా హెచ్చరికలు జారీ చేశారు. వార్షిక కసరత్తుల నిర్వహించాలని గత ఏడాది త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. డెమోక్రటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా (డీపీఆర్‌కే) వ్యతిరేకంగా ఈ సైనిక విన్యాసాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఉత్తరకొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మిలటరీ కూటమిని బలోపేతం చేసేందుకు అమెరికా, దాని అనుచరుల ఎత్తుగడలను డీపీఆర్‌కే ఎప్పటికీ పట్టించుకోదని పేర్కొన్నారు.

Read Also: Kalki 2898 AD: 40 ఏళ్ల క్రితమే కృష్ణం రాజు ‘కల్కి’ సినిమా స్టార్ట్ చేశారు: ప్రభాస్‌ పెద్దమ్మ

ఇక, ఆగ్నేయ ఉత్తర కొరియాలోని జాంగ్యోన్ నగరం నుంచి ఈశాన్య దిశలో 10 నిమిషాల సమయంలోనే రెండు క్షిపణులను ప్రయోగించామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. అయితే, ఉత్తర కొరియా సాధారణంగా తన తూర్పు జలాల వైపు క్షిపణులను పరీక్షిస్తుంది. ఉత్తర కొరియాలోని లోతట్టు ప్రాంతంలో రెండో క్షిపణి కూలిపోయే అవకాశం ఉందని దక్షిణ కొరియా సైనిక వర్గాలు తెలిపాయి. ఉత్తరాన భూమిపై సాధ్యమయ్యే నష్టం వెంటనే నివేదించబడలేదు.. యునైటెడ్ స్టేట్స్‌తో మిలిటరీ మైత్రితో ఉత్తర కొరియా ఎలాంటి రెచ్చగొట్టినా తిప్పికొట్టేందుకు దక్షిణ కొరియా సిద్ధంగా ఉందని సౌత్ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చెప్పుకొచ్చింది.