Site icon NTV Telugu

Telangana Elections 2023 : తెలంగాణలో ముగిసిన నామినేషన్ల పర్వం

Nominations

Nominations

తెలంగాణ శాసన సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 13న నామినేషన్ల స్కృటీని, 15న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. అయితే.. ఈనెల 30న పోలింగ్, వచ్చే నెల 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. నిన్న ఒక్క రోజే 1133 మంది నామినేషన్లు దాఖలు అయ్యాయి. నిన్నటి వరకు మొత్తం నామినేషన్లు 2028 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆర్వో కార్యాలయాల పరిసరాల్లో కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేశారు. 3 గంటలలోపు ఆర్వో కార్యాలయంలో ఉన్న వారికి నామినేషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చారు.

Also Read : Bandi Sanjay: అంబలి, అన్నదానం చేస్తే.. చేసిన పాపాలు పోతాయా? బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

ఆర్వో కార్యాలయానికి ఎక్కువ మంది అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ వేయడానికి వస్తే టోకెన్ పద్ధతిన అనుమతి ఇచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన సమయం నుండి అభ్యర్థి ఖర్చును వ్యయ పరిశీలకులు లెక్కించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 67 మంది వ్యయ పరిశీలకులను, సాధారణ పరిశీలకులను నియమించిన సీఈసీ. ఎప్పటికప్పుడు నివేదికను సీఈవో, సీఈసీకి నేవేదిస్తున్నారు పరిశీలకులు. ఇదిలా ఉంటే.. గత అసెంబ్లీ ఎన్నికల (2018) సందర్భంగా రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో 2,399 నామినేషన్లు దాఖలు కాగా అందులో 456 రిజెక్ట్ అయ్యాయి. మరో 367 నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. చివరకు 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ తర్వాత వీరిలో 1,569 మందికి డిపాజిట్లు కూడా రాలేదు.

Also Read : Kaleru Venkatesh: కాలేరు వెంకటేష్ కు ఆపూర్వ స్వాగతం.. అంబర్ పేటలో గెలిచేది బీఆర్ఎస్సే

Exit mobile version