Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Karimnagar Bandisanjay Sensational Comments On Cm Kcr 2

Bandi Sanjay: అంబలి, అన్నదానం చేస్తే.. చేసిన పాపాలు పోతాయా? బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Published Date :November 10, 2023 , 3:01 pm
By Bhanu
Bandi Sanjay: అంబలి, అన్నదానం చేస్తే.. చేసిన పాపాలు పోతాయా? బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bandi Sanjay: అంబలి, అన్నదానం చేస్తే చేసిన పాపాలు పోతాయా? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులారా.. ప్రభుత్వాలనే మార్చేసిన చరిత్ర మీరన్నారు. కేసీఆర్ అరాచక పాలన ఎట్లుందో, మీరు పడ్డ గోసను గుర్తు చేసుకోండని తెలిపారు. కేసీఆర్ పాలనను అంతం చేయండి. మీకోసం కొట్లాడిన బీజేపీని గెలిపించండి. పొరపాటున మళ్లీ కేసీఆర్ అధికారలోకి వస్తే 3 నెలల కోసారి జీతాలొస్తయ్. బదిలీలు, ప్రమోషన్లు రావని గుర్తుంచుకొండి’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణలో తొలి ఓటరున్న నియోజకవర్గం సిర్పూర్ కాగజ్ నగర్… బీజేపీ తొలి విజయం కూడా ఇక్కడే అని ధీమా వ్యక్తం చేశారు. కోనప్పా…. ఇక చాలప్ప…ఇగ ఆంధ్రాకు వెళ్లిపో అప్పా…’’ అంటూ ఎద్దేవా చేశారు. సిర్పూర్ కాగజ్ నగర్ బీజేపీ అభ్యర్ధిగా డాక్టర్ పాల్వాయి హరీష్ రావు ఈరోజు నామినేషన్ వేసిన సందర్భంగా సిర్పూర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వేలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సమక్షంలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు.

సంజయ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

Also Read

  • Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
  • Karimnagar: పోలీస్ శాఖలో నకిలీ ఐడీలతో జీతాలను చోరీచేసిన పోలీస్ అధికారి.. ఏకంగా రూ.1.40 కోట్లు
  • Karimnagar: కరీంనగర్ RBL బ్యాంకులో 138 కోట్ల మోసం బట్టబయలు.. వెలుగులోకి కీలక విషయాలు..
  • Mamidalapalli: మరణంలోనూ విడతీయని బంధం.. భర్త మరణించాడని భార్య కూడా..!

• ‘‘తెలంగాణలో తొలి ఓటరున్న నియోజకవర్గం సిర్పూర్ కాగజ్ నగర్… బీజేపీ తొలి విజయం కూడా ఇక్కడే… కోనప్పా…. ఇక చాలప్ప…ఇగ ఆంధ్రాకు వెళ్లిపో అప్పా…10 ఏళ్ల కింద ఈ నియోజకవర్గం ఎట్లుందో ఇప్పుడట్లనే ఉంది. బస్టాండ్ లేదు. ఆసుపత్రి లేదు.. మరి ఏం పీకడానికి ఎమ్మెల్యే ఉన్నడు? ఆయనకు ఎందుకు ఓటేయాలి?

• ఈ నియోజక వర్గంలో ఎంతో మంది రైతులున్నరు. కానీ వంద ఎకరాలకైనా సాగునీరిచ్చిండా? సాగు నీరివ్వలేని దుస్థితి. నదులకు నడక నేర్పిన ఇంజనీర్ కేసీఆర్ కు కాగజ్ నగర్ రైతులు కనబడతలేదా? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మేడిగడ్డకు పోతే మరి ఇక్కడి రైతుల సంగతేందని అడగడు.. బ్రిడ్జి లు కావాలని, రోడ్లు కావాలని అడగడు. ఏమైనా అంటే కేంద్రం నిధులిస్తలేదని బద్నాం చేసుడు తప్ప ఆయన చేసిన పని ఒక్కటైనా ఉందా? వార్థా నది మీద ప్రాజెక్ట్ కడతానని మాయమాటలు చెబుతూ మళ్లీ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నడు.

• కేవలం అధికారం, డబ్బు తో ఎలక్షన్ లో గెలవాలనుకుంటున్నడే తప్ప ఏనాడైనా ఫలానా పని చేశాను? ఫలానా చోట అభివ్రుద్ధి చేశానని చెప్పిండా? పల్లెల్లోకి పోయి ఓపెన్ గా ప్రజలతోముఖముఖి ఏర్పాటు చేసి అభివృద్ది చెప్పే ధైర్యం ఉందా?

• ఎమ్మెల్యే కోనేరు కొనప్ప సొంత ఎజెండా తో కాంట్రాక్టు లు తన సొంత మనుషులకే ఇస్తున్నాడు. అంబలి, అన్నదానం చేస్తున్నానని ప్రచారం చేసుకుంటాడే తప్ప ప్రజల అభివృద్ది గురించి మాత్రం పట్టించుకోడు. నియోజక వర్గంలో వ్యాపారాలను అన్ని కంట్రోల్ చేస్తున్నాడు. కనీస సౌకర్యాలు కల్పించక ఏ ముఖం తో ఓట్లు అడుగుతున్నడు?

• కొనప్పా అతని సోదరులు లిక్కర్ వ్యాపారం, బియ్యం దందా తో పాటు మట్కా ప్రోత్సహిస్తున్నారు. ఎస్పీ ఎం కంపెనీ లో ఇప్పుడు లోకల్ వాళ్ళ కన్నా నాన్ లోకల్, నార్త్ ఇండియా వాళ్ళే ఎక్కువ ఉన్నరు. లోకల్ వాళ్ళ కోసం కంపెనీ తెరిపించారా లేక నాన్ లోకల్ వాళ్ళ కోసం తెరిచారా? మన రాష్ట్రం ప్రజల సొమ్ముతో సబ్సిడీ లు ఇస్తూ వేరే రాష్ట్రం వ్యక్తులకు మేలు చేస్తే లాభం చేస్తారా? లోకల్ నిరుద్యోగుల కోసం ఒక కొత్త కంపెనీ ఏర్పాటు చేసే ఆలోచన కూడా చేయలేదు. ఇంత నిర్లక్ష్యమా?

• అంబలి, అన్నదానం తప్ప అభివ్రుద్ధి చేసినవా? అభివ్రుద్ధి జరగకపోతే.. ఉద్యోగాలియ్యకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలే తప్ప ఇంకా ఎందుకు పోటీ చేస్తున్నట్లు? చేసిన పాపాలన్నీ పోవాలని, మళ్లీ గెలవాలని అన్నదానం చేస్తే గెలుస్తాననుకుంటున్నవా? నువ్వు చేసిన పాపాలు ఊరికే పోవు. కేసీఆర్ ది కూడ ఇంతే. రాజసూయ యాగం పేరుతో క్షుద్ర పూలు చేసిండు…

• ఎస్పీఎం కంపెనీ నడుపుతున్న జేకే యాజమాన్యం మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కుమ్కక్కై కార్మికుల, ఉద్యోగుల పొట్ట కొడుతున్నరు. కంపెనీ రీ ఓపెన్ చేశామని చెప్పే సర్కార్, ఎమ్మెల్యే లు కంపెనీ తెరిచిన తర్వాత ఎంతమంది స్థానికులకు మేలు చేశారో దమ్ముంటే సమాధానం చెప్పాలి? సిర్పూర్ ను అభివ్రుద్ధి ఎందుకు చేయడం లేదని కేసీఆర్ ను నిలదీసే దమ్ముందా కోనప్పకు… మీ కోసం పోరాడితే జైలుకు పోయిన చరిత్ర పాల్వాయి హరీష్ ది… కోవిడ్ తో బాధపడుతున్నా వినకుండా హరీష్ ను గుంజుకుపోయి జైల్లో వేయించిన నీచుడు కోనప్ప… అయినా భయపడకుండా పోరాడిన చరిత్ర హరీష్ రావు కుటుంబానిదే…

• బీజేపీ అభ్యర్ధిని గెలిపిస్తే ప్రత్యేక నిధులు కేటాయించి సిర్పూర్ కాగజ్ నగర్ ను అభివ్రుద్ధి చేస్తాం. సిర్పూర్ మిల్లులో స్థానికులే ఉద్యోగాలిప్పస్తాం. రోడ్లు వేయిస్తాం…

• మీకోసం కొట్లాడిన పార్టీ బీజేపీ. 50 లక్షల మంది నిరుద్యోగులు, 40 లక్షల మంది రైతులు, లక్షలాది మంది రైతులు, విద్యార్థులు, మహిళల పక్షాన యుద్దం చేసినం. కేసులు పెట్టినా జైలుకు పంపినా భయపడకుండా మీకు అండగా ఉన్నం… తెలంగాణలో జరుగుతున్న అభివ్రుద్ధి నిధులన్నీ కేంద్రానివే…

• ఉద్యోగ, ఉపాధ్యాయులారా…. మీరు తల్చుకుంటే ప్రభుత్వాలనే మార్చేశారు. మీకోసం కొట్లాడిందెవరో ఆలోచించండి. పొరపాటున మళ్లీ కేసీఆర్ అధికారలోకి వస్తే 3 నెలల కోసారి జీతాలొస్తయ్. బదిలీలు, ప్రమోషన్లు రావు. గతంలో ఇట్లనే ఉద్యోగ సంఘాలను పిలిచి ఇదే చెప్పి బెదిరిస్తే…. నేను వార్నింగ్ ఇచ్చిన. జీతాలియ్యకపోతే గల్లాపట్టి లాక్కొస్తానని హెచ్చరిస్తే కేసీఆర్ దారికి వచ్చిండు…

• జీతాలే ఇయ్యలేనోడు మళ్లీ అధికారంలోకి వస్తే అప్పులెలా తీరుస్తడు. జీతాలెట్ల ఇస్తడు. ఉన్న భూములన్నీ అమ్మేసిండు. గల్లీగల్లీకి మద్యం షాపులు పెట్టిండు.. ఇగ అమ్మడానికి ఏమీ లేవు. మరెట్లా జీతాలెస్తడో చెప్పాలి.

• దళిత బందు..BC బందుల పేరు మీదే దళిత, బలహీన వర్గాల దగ్గర కమిషన్లు మింగిన రాబందులు మీరు…గెలుస్తానని ఎట్లనుకున్నరు? 50 లక్సల మంది నిరుద్యోగుల జీవితాలను నాశనం చేస్తివి. 40 లక్షల మంది రైతులను అరిగోస పెడితివి. పేపర్ లీకులతో, పరీక్ష నిర్వహించడం చేతగాక లక్షల మంది విద్యార్థులను ఆగం చెసినవ్.. ఉద్యోగులను ఆగమాగం చేస్తివి. కన్పించిన భూమినల్లా కబ్జా చేస్తివి. కమీషన్ల పేరుతో లక్షల కోట్లు దోచుకుంటివి. గెలిచినప్పటి నుండి ఫాంహౌజ్ కే పరిమితిమై కులుకుతుంటివి. 4 కోట్ల మంది ప్రజల ఉసురు పోసుకుంటివి. ఎట్లా గెలుస్తాననుకున్నవ్?

• సిగ్గు లేకుండా మళ్లీ గెలిచేందుకు కేసీఆర్ కాంగ్రెస్, ఎంఐఎం తో కలిసి కుట్ర చేస్తున్నడు. ఒవైసీ వావివరసలు మర్చేసి కేసీఆర్ ను మామ అంటున్నడు… ఎన్నికలకు ముందు అన్నదమ్ములట… ఎన్నికలొస్తే మామా అల్లుళ్లట…ఎన్నికలయ్యాక బావ బామ్మర్థులట. ఇవేం వరసలు? ఇట్లాంటోళ్లను ఓడించండి. సిర్పూర్ లో 80 శాతం మంది ఓటు బ్యాంకు మారి బీజేపీని గెలిపిస్తే కబ్జా చేరలో ఉన్న గోండు ఖిల్లాను విడిపించి మీకు అప్పగించే బాధ్యత నేను తీసుకుంటా.

• ఓడిపోతానని తెలిసి బీజేపీ గ్రాఫ్ తగ్గించే కుట్ర చేస్తున్నరు. కాంగ్రెస్, ఎంఐఎంతో కలిసి కుట్రలు చేస్తున్నరు. పైకి మాత్రం నువ్వు గిల్లు నేను ఏడుస్తా అన్నట్టు నటిస్తున్నరు. కాంగ్రెస్ కి పైసలు ఇచ్చేది KCR…BJP కి వ్యతిరేకంగా ప్రచారం చేసేది కాంగ్రెస్. ఇంకో పెద్ద అల్లుడితో కలిసి గెలవాలని కుట్రలు చేస్తున్నరు.

• సిర్పూర్ కాగజ్ నగరలో ఎంఐఎం అరాచకాలను ఎట్లా భరిస్తున్నరు? ఒక వర్గానికే చెందిన వాళ్లు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అవుతుంటే మీరేం చేస్తున్నరు. గోండు ఖిల్లాను కబ్జా చేస్తుంటే ఎందుకు అడ్డుకోరు. పాతబస్తీలో సభ పెట్టి నా దమ్ము చూపిన… సిర్పూర్ లో బీజేపీని గెలిపించి మీ సత్తా చాటండని తెలిపారు.
Seediri Appalaraju: పురంధేశ్వరి చంద్రముఖిగా మారారు.. టీడీపీలో చేరితే సరిపోతుంది కదా..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bandisanjay comments
  • Bandisanjay sensational comments
  • Bandisanjay sensational comments on CM KCR
  • BRS CM KCR
  • cm kcr

తాజావార్తలు

  • Elon Musk vs OpenAI Lawsuit: ప్రపంచ కుబేరుల మధ్య AI యుద్ధం.. ఎలోన్ మస్క్ వర్సెస్ సామ్ ఆల్ట్‌మాన్.. అసలేం జరుగుతోంది?

  • West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్‌కు ఆదేశం..

  • MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!

  • AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..

  • PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions