SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
- వృద్ధులు, చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకుని నోకియా 2360 ఫ్లిప్ ఫోన్ లాంచ్..
- అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ప్రత్యేక ఎస్ఓఎస్ బటన్
- ఫ్యామిలీ అసిస్ట్ ఫీచర్ ద్వారా కుటుంబ సభ్యులు దూరం నుంచే ఫోన్ సెట్టింగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nokia 2360 Flip: హెచ్ఎండీ (HMD) సంస్థ కొత్త ఫీచర్ ఫోన్‌ను తీసుకవచ్చింది. నోకియా 2360 ఫ్లిప్ (Nokia 2360 Flip) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, సులభంగా మొబైల్ ఉపయోగించాలనుకునే వారి కోసం తయారైంది. క్లామ్‌షెల్ డిజైన్‌తో పాటు అత్యవసర సమయాల్లో ఉపయోగపడే SOS బటన్, కుటుంబ సభ్యులు దూరం నుంచే ఫోన్ సెట్టింగ్స్ మార్చుకునేలా చేసే “ఫ్యామిలీ అసిస్ట్” (Family Assist) ఫీచర్‌ను ఇందులో అందించింది.
ఈ ఫోన్లోని ఫ్యామిలీ అసిస్ట్ ఫీచర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. దీని ద్వారా అనుమతి పొందిన కుటుంబ సభ్యులు దూరం నుంచే ఫోన్ వాల్యూమ్‌ను మార్చవచ్చు. కొత్త కాంటాక్ట్స్‌ను జోడించడంతో పాటు రోజువారీ రిమైండర్లను కూడా షెడ్యూల్ చేయవచ్చు. ఇందుకోసం ఫోన్‌ను నేరుగా చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టెక్నాలజీపై ఎక్కువ అవగాహన లేని వృద్ధులకు ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే భద్రత కోసం ఫోన్ వెనుక భాగంలో ప్రత్యేక SOS బటన్‌ను అందించారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ బటన్ నొక్కితే ముందుగా ఎంపిక చేసిన ప్రాథమిక కాంటాక్ట్‌కు ఆటోమేటిక్‌గా ఫోన్ కాల్ వెళ్తుంది. అంతేకాకుండా మరో ఐదుగురు వరకు ముందుగా ఎంపిక చేసుకున్న వ్యక్తులకు అత్యవసర SMS అలర్ట్స్ కూడా పంపిస్తుంది. దీంతో అవసరమైన సమయంలో కుటుంబ సభ్యులకు సమాచారం చేరుతుంది.
Also Read
- Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
- NASA Swift Telescope: నాసా రెస్క్యూ విఫలం.. భూమిపై కూలిపోనున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ.!
- IQOO Z11x 5G: 7200mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లేతో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే!
- Xiaomi TV A Pro e Series: షియోమి నుంచి 85 అంగుళాల 4K QLED టీవీలు.. 120Hz రిఫ్రెష్ రేట్, Google TVతో కొత్త సిరీస్ లాంచ్!
నోకియా 2360 ఫ్లిప్‌లో 2.8 అంగుళాల QVGA ప్రధాన డిస్ప్లేను అందించారు. ఇది 320 x 240 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. ఫోన్ బయటివైపు 1.77 అంగుళాల QQVGA సెకండరీ డిస్ప్లే కూడా ఉంది. ఇందులో నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించారు. 4MB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండగా.. మైక్రో SD కార్డు ద్వారా 32GB వరకు మెమరీని పెంచుకోవచ్చు. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో FM రేడియో, MP3 ప్లేయర్ ఉన్నాయి. డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో పాటు.. కనెక్టివిటీ కోసం USB టైపు-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను అందించారు.
బ్యాటరీ విషయానికి వస్తే.. నోకియా 2360 ఫ్లిప్‌లో 1,450mAh రిమూవబుల్ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 15 రోజుల స్టాండ్‌బై టైమ్, 27.5 గంటల వరకు టాక్‌టైమ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. చార్కోల్, టీల్, బర్గండీ రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. అయితే నోకియా 2360 ఫ్లిప్ ధర, విక్రయాలు ప్రారంభమయ్యే తేదీ, ఏయే దేశాల్లో అందుబాటులోకి వస్తుందనే వివరాలను ఇంకా వెల్లడించలేదు కంపెనీ.
తాజావార్తలు
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Florida Plane Crash: ఫ్లోరిడాలో కుప్పకూలిన బిజినెస్ జెట్.. 9 మంది దుర్మరణం
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..