Site icon NTV Telugu

Fake iPhones: తక్కువ ధరలకే నకిలీ ఐఫోన్లు.. విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

Fake Iphones

Fake Iphones

Fake iPhones: తక్కువ ధరలకే ఐఫోన్లు అంటూ జనాలను మోసం చేస్తున్న ఓ ముఠా గుట్టును రట్టు చేశారు నోయిడా పోలీసులు. నకిలీ ఐఫోన్లు విక్రయిస్తున్న నోయిడా గ్యాంగ్‌లోని ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ రాజధాని ప్రాంతంలో (NCR) తక్కువ ధరకు చైనా తయారు చేసిన డూప్లికేట్ యాపిల్ ఐఫోన్‌లను విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను నోయిడా పోలీసులు గురువారం పట్టుకున్నారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్టు చేశామని, వారి వద్ద నుంచి 60 డూప్లికేట్ ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నామని నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ నోయిడా) సాద్ మియాన్ ఖాన్ తెలిపారు.

పోలీసుల ప్రకారం.. ఈ ముఠా ఐఫోన్ 13ను రూ.53వేలకే అందిస్తామని కొనుగోలుదారులను ఆకర్షించింది. ఈ ఫోన్‌ సాధారణంగా మార్కెట్‌లో రూ.66వేలుగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా ఢిల్లీ మార్కెట్‌ల నుంచి కేవలం రూ.12,000 చొప్పున డూప్లికేట్ ఫోన్‌లను కొనుగోలు చేసింది. రూ.4.500 ఖరీదు చేసే నిజమైన ఐఫోన్‌ బాక్సులను, రూ.వెయ్యి విలువ గల యాపిల్‌ ఫోన్‌ స్టిక్కర్‌లను కొనుగోలు చైనీస్ ఆన్‌లైన్‌ షాపింగ్ పోర్టల్ నుంచి కొనుగోలు చేసిందని పోలీసులు తెలిపారు. ఈ డూప్లికేట్ ఫోన్‌లతో పాటు అసలైన స్టిక్కర్‌లు, బాక్స్‌ల ధర మొత్తం ఒక్కొక్క దానికి రూ.17,500 వరకు ఈ ముఠా ఖర్చు చేసింది. మోసపోయిన కొనుగోలుదారులకు IMEI నంబర్‌ను చూపించి వారిని మోసం చేసేందుకు మొబైల్ అప్లికేషన్‌ను కూడా ఉపయోగించారని పోలీసులు తెలిపారు.

Leopard Attack: ఇంట్లో ఉన్న వృద్ధుడిని ఈడ్చుకెళ్లి చంపేసిన చిరుత!

అరెస్టయిన వారిని లలిత్ త్యాగి, అభిషేక్ కుమార్, రజనీష్ రంజన్‌గా గుర్తించినట్లు నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాద్ మియాన్ ఖాన్ తెలిపారు. సెక్టార్ 63 పోలీస్ స్టేషన్‌లో నమోదైన రెండు కేసుల దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా డూప్లికేట్ ఐఫోన్‌లను విక్రయించి ప్రజలను మోసం చేసింది. కేసుకు సంబంధించిన ఫిర్యాదుదారుడు తనకు మొదట తక్కువ ధరకు నిజమైన ఐఫోన్‌ను ఇచ్చాడని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారి నుంచి కొనుగోలు చేసాడు. కానీ అతను మరిన్ని ఫోన్‌ల కోసం ఆర్డర్ చేసినప్పుడు నకిలీ మోడళ్లను విక్రయించారని అధికారి వెల్లడించారు. ముఠా వద్ద నుంచి 60 డూప్లికేట్ ఐఫోన్లు, రూ.4.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, వారు ఉపయోగించిన రెనాల్ట్ డస్టర్ కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్‌ డీసీపీ చెప్పారు. పోలీసు బృందం కొన్ని నకిలీ ఆధార్ కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు, ఈ విషయంలో విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు.

Exit mobile version