Site icon NTV Telugu

Noida dowry murder: నాన్నే అమ్మను లైటర్‌తో కాల్చి చంపాడు… నోయిడాలో దారుణం

02

02

Noida dowry murder: అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను.. ఓ భర్త అతికిరాతంగా చంపేసిన ఘటన గ్రేటర్ నోయిడాలోని సిర్సా గ్రామంలో వెలుగుచూసింది. నాన్నే అమ్మను లైటర్‌తో కాల్చి చంపాడని చెప్తున్న చిన్నారి బాలుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ హత్య వరకట్నం కోసం జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తతో పాటు, అత్తమామలపై కేసు నమోదు చేశారు.

READ ALSO: Sahasra M*rder Case : We want Justice.. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న సహస్ర పేరెంట్స్

రూ.35 లక్షల కోసం నూరేళ్ల ప్రాణాన్ని తీశారు..
గ్రేటర్ నోయిడాలోని కస్నా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన బాధితురాలికి డిసెంబర్ 2016లో వివాహం జరిగింది. బాధితురాలి సోదరి కాంచన్ మాట్లాడుతూ.. తాను, నిక్కీ ఇద్దరం ఒకే కుటుంబానికి చెందిన సోదరులను వివాహం చేసుకున్నామన్నారు. తాను రోహిత్‌ను వివాహం చేసుకోగా, నిక్కీ డిసెంబర్ 2016లో విపిన్‌ను పెళ్లి చేసుకుందని తెలిపారు. పెళ్లి జరిగిన నాటి నుంచే తమ అత్తమామలు నిక్కీని రూ.35 లక్షల వరకట్నం కోసం వేధించే వారని, నిక్కీ వరకట్నం తీసుకురాకపోవడంతో ఆగస్టు 21న తన భర్త విపిన్, కుటుంబ సభ్యులు తనను దారుణంగా కొట్టి, మెడపై దాడి చేశారని తెలిపింది. తను స్పృహ కోల్పోయిన తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారని కన్నీటిపర్యంతం అయ్యింది. స్థానికుల సహాయంతో ముందుగా ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స ఢిల్లీకి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి బాబు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి పిల్లవాడు వీడియోలో మాట్లాడుతూ.. తన నాన్న అమ్మను లైటర్తో కాల్చి చంపాడని చెప్పాడు.

వివాహంలో స్కార్పియో కారుతో సహా చాలా వస్తువులు ఇచ్చామని మృతిరాలి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు. అయినప్పటికీ నిక్కీ అత్తమామలు నిరంతరం రూ.35 లక్షల అదనపు వరకట్నం కోసం తమ బిడ్డను హింసలకు గురి చేయడమే కాక, హత్య చేశారని కుప్పకూలిపోయారు. పంచాయితీ ద్వారా రాజీకి రావడానికి చాలా ప్రయత్నాలు చేశామని, కానీ తన అత్తమామలు అంగీకరించలేదని వాపోయారు.

నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు..
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కాస్నా పోలీస్ స్టేషన్ పోలీసులు భర్త విపిన్, బావమరిది రోహిత్, అత్తగారు దయా, మామ సత్వీర్‌లపై కేసు నమోదు చేశారు. ఈసందర్భంగా గ్రేటర్ నోయిడా ADCP సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. నిందితులను అరెస్టు చేయడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలో వారందరినీ అరెస్టు చేస్తామని చెప్పారు.

READ ALSO: Dharmasthala case: సంచలన ‘ధర్మస్థల’లో అంతా తూచ్.. కంప్లైంట్ చేసిన వ్యక్తి అరెస్ట్..

Exit mobile version