Site icon NTV Telugu

Vikram Misri: కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు.. విక్రమ్ మిస్రీ సంచలన వ్యాఖ్యలు!

Vikram Misri1

Vikram Misri1

భారతదేశం-పాకిస్థాన్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం పార్లమెంటరీ కమిటీకి చెప్పారని ఇండియా టుడే ఓ కథనంలో తెలిపింది. సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక స్థాయిలో తీసుకున్నారని మిస్రీ నొక్కిచెప్పారని పార్లమెంటరీ వర్గాలు తెలిపినట్లు పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్-పాక్ వివాదాన్ని ఆపడంలో తన పాత్ర గురించి పదే పదే ప్రస్తావించారు. ట్రంప్ వాదనలపై ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మిస్రీ ఈ వ్యాఖ్యలు చేశారు.

READ MORE: Bellamkonda Srinivas : ప్రభాస్ మూవీ చేయకుండా ఉండాల్సింది..

“ట్రంప్ కనీసం ఏడుసార్లు కాల్పుల విరమణకు దోహదపడ్డానని బహిరంగంగా చెప్పుకున్నారు. ఈ అంశంపై భారతదేశం ఎందుకు మౌనంగా ఉంది?” అని పార్లమెంట్ ప్యానెల్‌లోని ఒక సభ్యుడు ప్రశ్నించారు. ముఖ్యంగా ట్రంప్ తన ప్రకటనలలో కశ్మీర్‌ను ప్రస్తావిస్తూనే ఉన్నారని మరో సభ్యుడు సూటిగా ప్రశ్నించారు. దీంతో భారతదేశం-పాకిస్థాన్ కాల్పుల విరమణ ద్వైపాక్షిక నిర్ణయం అని, మరే ఇతర దేశ ప్రమేయం లేదని పేర్కొంటూ విదేశాంగ కార్యదర్శి ఈ వాదనలను తోసిపుచ్చారని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. “యుద్ధ విరమణ ఒప్పందంలో అమెరికా ఎటువంటి పాత్ర పోషించలేదు” అని మిస్రీ ప్యానెల్‌కు వివరణ ఇచ్చారు.

READ MORE: Manchu Manoj : తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. తండ్రి చనిపోతే నారా రోహిత్ అలా చేశాడు!

ఇంకా.. భారత్- పాకిస్థాన్ మధ్య వివాదం సంప్రదాయ యుద్ధ పరిధిలోనే ఉందని, ఇస్లామాబాద్ నుంచి ఎటువంటి అణ్వాయుధ దాడులకు సంబంధించిన అనుమానిత సంకేతాలు లేవని విదేశాంగ కార్యదర్శి పునరుద్ఘాటించారు. కానీ.. పాకిస్థాన్ చైనా మూలాల సైనిక హార్డ్‌వేర్‌ను ఉపయోగించడంపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్పందించిన విక్రమ్ మిస్రీ.. “వారు ఏమి ఉపయోగించినా పర్వాలేదు. మనము వారి వైమానిక స్థావరాలను తీవ్రంగా దెబ్బతీశాం అని చెప్పినట్లు తెలుస్తోంది. యుద్ధ సమయంలో కోల్పోయిన భారతీయ విమానాల సంఖ్య గురించిను చెప్పేందుకు మిస్రీ నిరాకరించారు. జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ వ్యాఖ్యానించలేదు.

Exit mobile version