NTV Telugu Site icon

USA:” ఆ విషయంలో భారత్ కు ప్రత్యేక మినహాయింపులేమీ లేవు”

Canada

Canada

కెనడా-భారత మధ్య ఖలిస్తానీ చిచ్చు ఆరడం లేదు.  ఖలిస్థానీ మద్దతుదారుడు నిజ్జర్ హత్యతో భారత్ కు సంబంధాలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడంతో మొదలైన వివాదం రోజు రోజుకు ముదురుతోంది. భారత రాయబారిని కెనడా నుంచి బహిష్కరించడం, అదేవిధంగా భారత్ కూడా కెనడా ప్రతినిధిని దేశం విడిచి వెళ్లాలంటూ హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Glenmark Life Sciences: రూ.5,651 కోట్లతో గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్‌లో 75 శాతం వాటా కొన్న నిర్మా గ్రూప్

కెనడా- భారత్ మధ్య నెలకొన్న వివాదం గురించి ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ విషయంపై మొదట్లోనే స్పందించింది. ఇక ఇప్పుడు దీని గురించి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రెండు దేశాలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కన్నారు. కెనడా వివాదంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత ప్రధాని మోడీతో మాట్లాడారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ఈ అంశంపై ప్రైవేటుగా జరిగిన దౌత్య చర్చల లోతుల్లోకి నేను వెళ్లదలుచుకోలేదు. ఈ అంశంపై భారత్‌తో మేము ఉన్నతస్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నాం అని జేక్ సల్లివన్ వెల్లడించారు. కెనడా భారత్ అంశంపై తమకు ఆందోళనగా ఉందని పేర్కొన్న జేక్ సల్లివన్.. ఈ వివాదాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొ్న్నారు. దీనిపై అమెరికా దృష్టిసారించిందని,  ఈ అంశంలో ఇండియాకు ప్రత్యేకమైన మినహాయింపు ఏదీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇక అమెరికా జోక్యంతో అయినా ఈ వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి మరి.

ఖలిస్తానీ ఉద్యమం, భారత వ్యతిరేఖ చర్యలకు పాల్పడుతున్న కెనడా పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ ను జూన్ 18న వాంకోవర్ లోని సర్రేలో గుర్తు తెలియని వ్యక్తుల కాల్చి చంపారు. సిక్కులకు కేంద్రంగా ఉండే సర్రేలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే సిక్కు వేర్పాటువాదుల్ని సంతృప్తి పరిచేందుకు, భారత్ వ్యతిరేఖ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై కెనడా కళ్లుమూసుకుందని భారత్ ఆరోపించింది. ఇక జీ20 సమావేశాలకు హాజరయినప్పుడు కూడా ఖలీస్తానీ ఉద్యమకారులపై చర్యలు తీసుకోవాలని మోడీ కెనడా ప్రధానికి సూచించిన విషయం తెలిసిందే.