తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులకి గోదావరి అద్దం పడుతుంది. గోదావరి నీటిమట్టం ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం కేవలం రెండు అడుగులు మాత్రమే ఉంది. ప్రతి ఏటా భద్రాచలం వద్ద జులై ఆగస్టు నెలలో భారీ ఎత్తున వరదలు రావడం రెండవ, మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఆనవాయితీగా జరుగుతుంది. గత ఏడాది ఇదే రోజున భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులు అంటే మూడవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించింది.
Also Read : Viraj Ashwin: విరాజ్ అశ్విన్ కి లక్కీ ‘బేబీ’!
ఆనాడు జూలైలోనే 71.3 అడుగులకు చేరుకుని ప్రమాదకరస్థాయిలో గోదావరి ప్రవహించింది.. కానీ నేడు మాత్రం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం రెండు అడుగులు మాత్రమే ఉన్నది ఎగువన వర్షాలు లేకపోవడం వల్ల చత్తీస్గడ్ మహారాష్ట్ర ఒరిస్సా రాష్ట్రాల్లో వర్షాలు లేకపోవడంతో భద్రాచలం వద్ద గోదావరి పరివాహక ప్రాంతంలో నీళ్లు లేక వేలవేల పోతున్న పరిస్థితి ఉంది అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి భూపాల్ మరింత సమాచారాన్ని అందిస్తారు.
Also Read : Viral News: నీ ఐడియా ముందు ఇంజనీర్స్ వేస్టే బాబాయ్.. అదిరిపోలే..
ఇదిలా ఉంటే.. తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు తీరంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పటినట్లు పేర్కొంది. ఆవర్తన ద్రోణి సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు చెప్పింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాత్రి సమయంలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.