Site icon NTV Telugu

Pawan Kalyan: కాన్వాయ్ వల్ల జేఈఈ పరీక్ష విద్యార్థులు ఎవరు ఇబ్బంది పడలేదు.. అవన్నీ తప్పుడు కథనాలే

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: తాజాగా విశాఖపట్నంలో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్ష సందర్భంగా ట్రాఫిక్ కారణంగా విద్యార్థులు పరీక్షకు ఆలస్యం అయినట్టు సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను ట్రాఫిక్ అధికారులు ఖండించారు. ఈ సందర్బంగా ట్రాఫిక్ ADCP ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. జేఈఈ పరీక్ష సమయంలో ట్రాఫిక్ అంతరాయం జరిగిందన్న వార్తలు అసత్యం అని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ 8:45కి పరీక్ష కేంద్రం ప్రాంతాన్ని దాటి వెళ్లిందని.. పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులు 8:30 కల్లా చేరాల్సి ఉండగా ఆ సమయంలో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం జరగలేదని స్పష్టం చేశారు.

Read Also: Srinivasa Reddy: ప్రజా ఆరోగ్య వ్యవస్థను ప్రైవేట్ పరం చేసి పేదల దగ్గర డబ్బులు గుంజాలని చూస్తున్నారు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కోసం కేవలం BRTS రోడ్‌నే ఉపయోగించామని, ఎన్ఏడి నుంచి పెందుర్తి వరకు విద్యార్థులకు ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తుగా సున్నితంగా ప్లాన్ చేసినట్లు ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు. అలాగే, ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వార్తలు ప్రచారం చేయడం తగదని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వల్ల పరీక్షలపై ఎలాంటి ప్రభావం చూపలేదని, ట్రాఫిక్ సమర్ధవంతంగా నిర్వహించామని అధికారులు స్పష్టం చేశారు.

Exit mobile version