NTV Telugu Site icon

EPFO: ఆధార్‌ కేవైసీ ఉంటే ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు

Epfo

Epfo

ప్రతి ఉద్యోగికి పీఎఫ్ ఉంటుంది. ఆయా కంపెనీలు ప్రతీ నెల నగదు జమ చేస్తుంటాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో కొంత డబ్బు తీసుకునే వెసులబాటును ఈపీఎఫ్‌వో కల్పించింది. ఒకప్పుడు క్లెయిమ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు ఆన్‌లైన్ సిస్టం వచ్చాక.. మార్గం సులువైంది. ఇకపోతే ఒకప్పుడు.. రోజులు తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది.. ఇప్పుడు అలా కాదు.. క్లెయిమ్ చేసుకున్న కొన్ని గంటల్లోనే డబ్బు అకౌంట్‌లో జమ అయిపోతుంది.

ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణకు స‌మాచార క‌మిష‌న‌ర్లు.. ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

ఇదిలా ఉంటే ఈపీఎఫ్‌ క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ మార్గం సుగమం చేసింది. క్లెయిమ్‌తో పాటు చెక్, బ్యాంకు పాస్‌పుస్తకం కాపీ ఇవ్వలేదంటూ క్లెయిమ్‌ తిరస్కరించకుండా చందాదారులకు వెసులుబాటు కల్పించింది. అయితే చందాదారుడి బ్యాంకు ఖాతా వివరాల కేవైసీ ఆమోదించినవారికే ఈ సదుపాయం లభిస్తుందని ఈపీఎఫ్‌వో తెలిపింది.

ఇది కూడా చదవండి: Coconut: కొబ్బరితో ఎన్ని ప్రయోజనాలో..!

చందాదారుడి ఖాతా వివరాలను బ్యాంకు, ఎన్‌పీసీఐ ఆధార్‌ కేవైసీ ద్వారా ధ్రువీకరణ పూర్తయిన క్లెయిమ్‌లకు చెక్, బ్యాంకు పాసుపుస్తకం జతచేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఆధార్‌ కేవైసీ పూర్తయిన చందాదారుల క్లెయిమ్‌లపై ‘బ్యాంకు కేవైసీ ఆన్‌లైన్లో ధ్రువీకరణ పూర్తయింది. చెక్, పాస్‌ పుస్తకం జతచేయాల్సిన అవసరం లేదు’ అంటూ క్లెయిమ్‌ దరఖాస్తులో నోట్‌ ఉంటుందని ఈపీఎఫ్‌వో తెలిపింది. ఈ సమాచారం ఆధారంగా ఉద్యోగులు క్లెయిమ్‌ దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Yemen: యెమెన్‌లో విషాదం.. పడవ బోల్తా.. 49 మంది మృతి

Show comments