Site icon NTV Telugu

Congress: సుప్రీంకోర్టులో కాంగ్రెస్కు బిగ్ రిలీఫ్..

Sc

Sc

లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి బిగ్ రిలీప్ ఇచ్చింది. రూ.3500 కోట్ల పన్ను బకాయిల విషయంలో జూలై 24వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆదాయపన్ను శాఖ సుప్రీంకోర్టులో తెలిపింది. ఇప్పటికే పన్ను బకాయిలు చూపించి కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాల నుంచి ఐటీ శాఖ 135 కోట్ల రూపాయలను రికవరీ చేసింది. అయితే, దీనిపై కాంగ్రెస్‌ పార్టీ ముందుగా హైకోర్టు ఆశ్రయించగా అక్కడ ఊరట దొరకకపోవడంతో.. ఆ తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లింది. కాంగ్రెస్‌ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ (సోమవారం) ఉన్నత న్యాయస్థానం విచారణ చేసింది.

Read Also: Vijay Devarakonda : విజయ్ దేవరకొండ లవ్ స్టోరీస్ మామూలుగా లేవుగా..

ఈ సందర్భంగా సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ.. లోక్‌ సభ ఎన్నికలు ముగిసే వరకు ఏ పార్టీని ఆదాయపన్ను శాఖ నుంచి బకాయిల విషయంలో ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని తెలియజేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తదుపరి విచారణను జూలై 24వ తేదీకి వాయిదా వేసింది. ఇక, 2017- 2018 నుంచి 2020- 2021 అసెస్‌మెంట్‌ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీలతో కలిపి 1,823 కోట్ల రూపాయలను చెల్లించాలని శుక్రవారం నాడు ఐటీ శాఖ నోటీసులు పంపింది. నిన్న(ఆదివారం) 1744 కోట్ల రూపాయలు కట్టాలని మరో నోటీసులు ఇచ్చింది.

Read Also: Rishabh Pant Fine: రిషబ్ పంత్‌కు భారీ జరిమానా.. రిపీట్ అయితే అంతే సంగతులు!

అయితే, 2014-15 నుంచి 2016- 17 అసెస్‌మెంట్‌ సంవత్సారాలకు సంబంధించిన పూర్తి మొత్తాన్ని ఆ నోటీసులో ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం లోక్‌ సభ ఎన్నికల వేళ పన్ను ఉగ్రవాదంతో ప్రధాన ప్రతిక్షాలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపణలు చేస్తున్నాయి. ఇక, ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిషన్ కి కూడా ఫిర్యాదు చేసింది.

Exit mobile version