Site icon NTV Telugu

Medical College : నిర్మల్ జిల్లా మెడికల్‌ కాలేజీకి ఎన్ఎంసీ ఆమోదం.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం

Mediacal College

Mediacal College

తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని నిర్మిస్తుంది. అయితే సీఎం కేసీఆర్ సారథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సపోర్ట్ తో నిర్మల్ జిల్లా ప్రజల చిరకాల కల నెరవేరబోతుంది. నిర్మల్ జిల్లా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ త్వరలో ప్రారంభం కాబోతుంది. మెడికల్‌ కాలేజీ ప్రారంభానికి అవసరమైన ప్రాథమిక అనుమతులను నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌, మెడికల్ అసెస్మెంట్ అండ్‌ రేటింగ్ బోర్డ్ పర్మిషన్ లను మంజూరు చేసింది. ఈ మేరకు 100 మెడికల్‌ సీట్ల ప్రవేశానికి నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ప్రాథమిక అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Also Read : Disney Hotstar: డిస్నీ హాట్‌స్టార్‌కి జియో సినిమా దెబ్బ.. 4 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఔట్..

దీంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాలేజ్ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు, ప్రత్యేక చొరవ చూపిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. 2023- 2024 నుంచి మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ క్లాసులు ప్రారంభంకానున్నాయి. నిర్మల్ జిల్లా ప్రజలు ఎంతోకాలంగా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజల కోరిక మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఇచ్చిన హామీ మేరకు నిర్మల్ జిల్లాకు మెడికల్‌ కాలేజీని మంజూరు చేసి దాన్ని సాధించామని ఆయన వెల్లడించారు.

Also Read : Pawan Kalyan Live: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

నిర్మల్‌జిల్లా కేంద్రంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ఉత్తర్వులను జారీ చేయటంతో పాటు నిధులు కూడా కేటాయించింది. మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కూడా కేటాయించింది. దీంతో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో 2023-24 ఏడాదిలో ఎంబీబీఎస్ తరగతులు స్టార్ట్ కానున్నాయి.

Exit mobile version