NTV Telugu Site icon

IPL 2024: కేకేఆర్లోకి గౌతమ్ గంభీర్..! షారుక్ తో భేటీ అందుకే

Gambhir

Gambhir

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 24వ సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్ రీ ఎంట్రీపై చర్చలు కూడా జరుగుతున్నాయి. గౌతమ్ గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు తిరిగి రావచ్చని కెప్టెన్ నితీష్ రానా కూడా సూచించాడు. అయితే గౌతమ్ గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ (KKR) యజమాని షారుక్ ఖాన్‌ను కూడా కలిశాడు. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Padma Hilsa: దుర్గా నవరాత్రి ఉత్సవాలకు బంగ్లాదేశ్ గిఫ్ట్.. “పద్మా పులస” చేపల ఎగుమతికి ఓకే..

ఇంతకుముందు గౌతమ్ గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో కీలక పాత్ర పోషించాడు. గంభీర్ 2011 నుండి 2017 వరకు KKR కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే అతని కెప్టెన్సీలోనే 2012, 2014లో కేకేఆర్ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అంతేకాకుండా.. గంభీర్ కెప్టెన్సీలోనే కోల్ కతా ఐదు సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగలిగింది. ప్రస్తుతం గౌతమ్ గంభీర్.. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తో మెంటార్ గా కొనసాగుతున్నాడు. జస్టిన్ లాంగర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించినప్పటి నుండి గంభీర్ లక్నోతో విడిపోయే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇప్పుడు షారుక్, గంభీర్‌ల భేటీతో ఈ అనుమానాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.

Vijay Antony: నా కూతురుతో పాటు నేనూ చనిపోయాను.. మీరా మరణం తరువాత విజయ్ ట్వీట్

ఇంతకుముందు గంభీర్ షారుక్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. షారుక్ బాలీవుడ్‌కే కాదు హృదయాలకు కూడా రారాజు అన్నారు. షారుక్‌ ఖాన్‌ని కలిసినప్పుడల్లా తనకు చాలా ప్రేమ కలుగుతుందని.. షారుక్ ది బెస్ట్ అన్నారు. మరోవైపు 2023లో కేకేఆర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన నితీష్ రాణా.. గంభీర్ పునరాగమనంపై సూచన చేశాడు. షారుఖ్, గంభీర్ తమ రంగాలకు రాజులు అని ట్వీట్ చేశాడు. ఇది ఇంటికి తిరిగి రావడానికి సంకేతం కాదా? నేను దాని గురించి ఆలోచిస్తున్నానన్నారు.

Show comments