Site icon NTV Telugu

Nitish Kumar: 20నే సీఎంగా నితీష్ ప్రమాణం.. మంత్రివర్గ కూర్పుపై కసరత్తు

Nitish Kumar

Nitish Kumar

బీహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్ నవంబర్ 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముచ్చటగా పదోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఇదిలా ఉంటే సోమవారం గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌‌ను కలిసిన నితీష్ కుమార్.. ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేయాలని కోరారు. నవంబర్ 19 నుంచి అమల్లోకి వచ్చేలా చూడాలని సిఫార్సు చేశారు. దీంతో పాత ప్రభుత్వం బుధవారంతో ముగుస్తుంది.

ఇది కూడా చదవండి: DK Shivakumar: ఆ ప్రశ్న జ్యోతిషుడిని అడగండి.. డీకే.శివకుమార్ అసహనం

ఇక నవంబర్ 20న పాట్నాలోని గాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణం చేయనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చోటు కల్పిస్తూ మంత్రివర్గ కూర్పు చేస్తున్నారు. అయితే స్పీకర్ పోస్ట్‌పై బీజేపీ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. స్పీకర్ పదవిని తమకే ఇవ్వాలంటూ కమలనాథులు కోరుతున్నట్లు సమాచారం. అయితే స్పీకర్ పోస్ట్ మాత్రం తమకే దక్కాలంటూ జేడీయూ పట్టుబడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీల్లో స్పీకర్ పోస్ట్ ఎవరికి దక్కుతుందో చూడాలి. ఇదిలా ఉంటే నవంబర్ 20న జరిగే నితీష్ కుమార్ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీ, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, సీనియర్లు హాజరుకానున్నారు.

ఇది కూడా చదవండి: Umar: ఢిల్లీ బ్లాస్ట్‌కు ముందు ఏం జరిగింది.. వెలుగులోకి ఉమర్ సంచలన వీడియో

చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎల్జీపీకి మూడు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.హెచ్ఏఎం-ఎస్, ఆర్ఎల్ఎంలకు ఒక్కొక్క స్థానం లభించే అవకాశం ఉంది. నితీష్ కుమార్ తో పాటు దాదాపు 16 మంది బీజేపీ నాయకులు, జేడీయూ నుంచి 14 మంది నాయకులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జేడీయూ నుంచి ఆరుగురు కొత్త ముఖాలు ఉండనున్నట్లు సమాచారం.

Exit mobile version