Site icon NTV Telugu

Nitish Kumar: సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం..

Nitish

Nitish

బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. 9వసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు హాజరయ్యారు. తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణం చేసి దేశంలోనే నితీష్ సరికొత్త రికార్డ్ సృష్టించారు.

నితీష్‌తో పాటు ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ నుంచి విజయ్ కుమార్ సిన్షా, సామ్రాట్ చౌదరి ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జేడీయూ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, హిందూస్థాన్ ఆవామ్ మోర్చా నుంచి ఒకరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

Exit mobile version