Site icon NTV Telugu

Nitish Kumar: ‘మీరే తాగుబోతులు, మధ్య నిషేధంపై మాట్లాడేది మీరా?’.. బీజేపీ ఎమ్మెల్యేలపై సీఎం నితీష్ ఫైర్

Nitish Kumar Attack

Nitish Kumar Attack

Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ అసెంబ్లీలో విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. 2016 నుంచి రాష్ట్రంలో మద్యం మరణాలపై అసెంబ్లీలో బుధవారం ప్రశ్నించిన బీజేపీ సభ్యులపై ఆయన మండిపడ్డారు. ‘మీరే తాగుబోతులు.. మద్య నిషేధం గురించి మీరా మాట్లాడేది?’ అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. అయితే నినాదాలు చేస్తున్న వారిపై సీఎం నితీశ్‌ కుమార్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం జరిగింది? నిశ్శబ్దంగా ఉండండి. వారిని సభ నుంచి బయటకు పంపండి’ అని సభను ఉద్దేశించి అన్నారు.

India-China Clash Video: తరిమి తరిమికొట్టిన భారత జవాన్లు.. వీడియో వైరల్

సరణ్ జిల్లాలోని ఛప్రాలో నకిలీ మద్యం తాగి పలువురు మరణించారు. మరిన్ని మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. ఈ మరణాలు అనుమానాస్పదంగా ఉన్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. కారణాన్ని ఇంకా కనుగొనలేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడైన బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హా, బీహార్‌ రాష్ట్రంలో అమలు చేస్తున్న మద్య నిషేధంపై అసెంబ్లీలో పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో సీఎం నితీశ్‌ కుమార్‌ సహనం కోల్పోయారు. ‘మద్య నిషేధం గురించి మీరా మాట్లాడేది.. మీరే పెద్ద తాగుబోతులు’ అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా విపక్ష బీజేపీ ఎమ్మెల్యే మండిపడుతున్నారు. బీహార్ అసెంబ్లీలో ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ తీవ్రంగా స్పందించారు. నితీష్‌ కాలం ముగిసిందని అన్నారు. ఆయన తరచుగా సహనం కోల్పోతున్నారని.. సీఎం వైఖరి సరిగా లేదని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version