Site icon NTV Telugu

Nitish Kumar: దేశంలో థర్డ్‌ ఫ్రంట్‌ లేదు.. కాంగ్రెస్‌తో కలిసి ఒకటే కూటమి..

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: దేశంలోని కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు సహా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని జేడీయూ చీఫ్‌, బిహార్‌ సీఎం నితీష్ కుమార్ కోరారు. ఈ “ప్రతిపక్షాల ప్రధాన ఫ్రంట్” 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ ఘోరంగా ఓడిపోయేలా చేస్తుందని ఆయన అన్నారు.బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమైతే దేశాన్ని నాశనం చేసేందుకు పని చేస్తున్న వారిని తరిమికొట్టగలమని, హిందువులు, ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు లేవని, అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జాతీయ స్థాయిలో మనమంతా ఒక్కతాటిపైకి రావాలన్నదే తన కోరిక అని.. మరిన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని నితీష్‌ కుమార్ అన్నారు.

తాను ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిని కానని తెలిపారు. థర్డ్ ఫ్రంట్ అనే ప్రశ్నే లేదని.. కాంగ్రెస్‌తో సహా ఒక ఫ్రంట్ ఉండాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పార్టీలు లేకుండా కూటమిని ఊహించలేమన్నారు. హర్యానాలోని ఫతేహాబాద్‌లో మాజీ ఉప ప్రధాని దేవిలాల్ 109వ జయంతి వేడుకలు ఆదివారం జరిగాయి. ఐఎన్‌ఎల్‌డీ నిర్వహించిన ఈ మహా సభకు ప్రతి పక్షాలకు చెందిన అగ్ర నేతలు తరలివచ్చారు. ఈ ర్యాలీలో ఇతర విపక్ష నేతలతో కలిసి పాల్గొన్న నితీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ర్యాలీని బీజేపీయేత పార్టీల మధ్య ఐక్యతకు తొలి అడుగు అని అన్నారు బిహార్‌ సీఎం నితీష్ కుమార్‌.

Tejaswi Yadav: బీజేపీ బడా ఝూఠా పార్టీ.. ఇప్పుడు ఎన్డీయే అనేదే లేదు..

2025 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఐఎన్‌ఎల్‌డీ నిర్వహించిన ఈ మహా సభకు ప్రతి పక్షాలకు చెందిన అగ్ర నేతలు తరలివచ్చారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జేడీ(యూ) చీఫ్‌, బిహార్ సీఎం నితీశ్ కుమార్, బిహార్‌ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, సీపీఎం నేత సీతారాం ఏచూరి, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సహా పలువురు ప్రముఖ నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ తరఫున ఎవరూ పాల్గొనకపోవడం గమనార్హం.

Exit mobile version