Site icon NTV Telugu

Prashanth Kishor: నితీష్‌కు వయసు మీద పడి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు..

Prashanth Kishor

Prashanth Kishor

Prashanth Kishor: బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు వయసు మీద పడి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ప్రశాంత్‌ కిషోర్ ఎద్దేవా చేశారు. ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. నితీష్‌ ఇప్పుడు భ్రమలో ఉన్నారని.. ప్రస్తుతం ఎవరిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అందుకే రాజకీయంగా ఏకాకి అయ్యాయనే బాధతో ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.

జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయమని ప్రశాంత్ కిషోర్ గతంలో తనకు సలహా ఇచ్చినట్లు బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్‌ కిషోర్‌ బీజేపీ కోసం పని చేస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై పీకే స్పందిస్తూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy: TRS పై పిటిషన్ వేశాను.. విచారణ పూర్తయ్యే వరకు BRSగా పేరు మారదు

నితీష్‌ కుమార్‌ మొదట తాను బీజేపీ కోసం పనిచేస్తున్నా అని చెప్పారని… ఆ తర్వాత జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయమని సలహా ఇచ్చానని అంటున్నారని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను బీజేపీ కోసం పనిచేస్తే జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయమని ఎందుకు చెప్తానని ప్రశ్నించారు. ఆ పార్టీని ఎందుకు బలోపేతం చేస్తానన్నారు. నితీష్‌ చెప్పిన రెండు విషయాలకు అసలు పొంతనే లేదని ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు.

Exit mobile version