NTV Telugu Site icon

Nitin Chauhan Death: 35 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకున్న నటుడు!

Nitin Chauhaan Died

Nitin Chauhaan Died

ప్రముఖ బుల్లితెర నటుడు నితిన్ చౌహాన్ (35) మృతి చెందారు. గురువారం ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని అతని సహనటులు సుదీప్ సాహిర్, సయంతని ఘోష్, విభూతి ఠాకూర్ ధ్రువీకరించారు. నితిన్ మరణ వార్త తెలిసిన వెంటనే నటి విభూతి ఠాకూర్ భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. చిన్న వయసులోనే నితిన్ చనిపోయిన విషయాన్ని తోటీ నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు.

నితిన్ చౌహాన్ ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్‌ నివాసి. సినిమాలపై ఉన్న ఇష్టంతో గత కొన్నేళ్లుగా ముంబైలో ఉంటున్నారు. నితిన్ మృతి చెందిన విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు స్నేహితులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ముంబైకి వచ్చి.. నితిన్ మృతదేహాన్ని అలీగఢ్‌కు తీసుకెళ్లారు. నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. నితిన్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు.. దర్యాప్తు ఆరంభించారు.

Also Read: SA vs IND: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. ఆ ఇద్దరి అరంగేట్రం ఖాయమే! విషయం చెప్పేసిన సూర్య

రియాల్టీ షో ‘దాదాగిరి 2’ విజేతగా నిలిచిన అనంతరం నితిన్ చౌహాన్ పేరు మార్మోగిపోయింది. స్ప్లిట్స్‌విల్లా 5, జిందగీ డాట్ కామ్, క్రైమ్ పెట్రోల్, ఫ్రెండ్స్ వంటి రియాలిటీ షోలతో ప్రజాదరణ పొందారు. 2022లో సాబ్ టీవీ దినపత్రిక ‘తేరా యార్ హూన్ మైన్’లో నితిన్ చివరిసారిగా స్క్రీన్‌పై కనిపించారు. నితిన్ త్వరలో తన 36వ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని ప్లాన్ చేశారట. అయితే పుట్టినరోజుకు వారం ముందే ఆయన మరణించారు.

Show comments