SA vs IND: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. ఆ ఇద్దరి అరంగేట్రం ఖాయమే! విషయం చెప్పేసిన సూర్య
- దక్షిణాఫ్రికాతో భారత్ తొలి టీ20
- ఇద్దరికి అరంగేట్ర అవకాశం
- భారత టీ20 జట్టు ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య టీ20 పోరుకు వేళయింది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తెరలేవనుంది. డర్బన్ వేదికగా శుక్రవారం రాత్రి 8.30 గంటలకు తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. ఇటీవల బంగ్లాదేశ్‌పై క్లీన్‌స్వీప్ విజయంతో భారత్ మంచి జోరుమీదుంటే.. సొంతగడ్డపై సత్తాచాటేందుకు సఫారీ టీమ్ సై అంటోంది. ఇప్పటికే కుర్రాళ్లతో కూడిన టీమిండియా.. ఈ సిరీస్‌లో ఇద్దరికి అరంగేట్ర అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాటలు ఇందుకు మరింత బలం చేకూర్చాయి.
దక్షిణాఫ్రికాలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ చెఫ్ అవతారం ఎత్తాడు. అయితే సూర్య ఓ వంటకం గురించి చెప్పాడు కానీ.. అది తినేది మాత్రం కాదు. మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యే భారత జట్టు గురించి. ఆ వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ‘హాయ్ ఫ్రెండ్స్ నేను మీకోసం రెండు అద్భుతమైన రెసిపీలను తీసుకొచ్చా. అవి మైదానంలో బరిలోకి దిగేందుకు మాత్రమే. ఒకరు అద్భుతమైన బౌలర్. మరొకరు సూపర్ బ్యాటర్. ఫాస్ట్ బౌలర్ అంటే బలంగా ఉండాలి, తెలివిగా వ్యవహరించాలి. ఆ రెండు గుణాలు మనోడిలో ఉన్నాయి. అతడే వైశాఖ్ విజయ్ కుమార్’ అని సూర్య చెప్పాడు.
Also Read
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
‘రెండో రెసిపీకి ఎంతో ధైర్యం ఉంది. ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. ఎప్పుడూ అతనిలో ఉత్సాహం కనిపిస్తుంది. ఫుట్‌వర్క్ మసాలా అయితే చాలా బాగుంటుంది. రుచికరమైన చట్నీ లాంటి ఏకాగ్రత, పసందైన పొడులు మాదిరిగా షాట్లు కొట్టే టైమింగ్ అతడి సొంతం. అతడే రమణ్‌దీప్ సింగ్. ఈ ఇద్దరు అద్భుతంగా ఆడుతారని నేను భావిస్తున్నా. వారికి ఆల్ ది బెస్ట్’ అని సూర్యకుమార్ యాదవ్ వీడియోలో చెప్పుకొచ్చాడు. విజయ్ కుమార్, రమణ్‌దీప్ సింగ్‌లు తొలి మ్యాచ్‌లో ఆడతారో? లేదో చూడాలి.
Also Read: Today Gold Rate: ‘బంగారం’ సంతోషం ఒక్కరోజే.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్!
భారత టీ20 జట్టు ఇదే:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వైశాఖ్ విజయ్ కుమార్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్.
తాజావార్తలు
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!