NTV Telugu Site icon

Nithya Menon : దర్శకనిర్మాతలను ఇబ్బంది పెడుతున్న నిత్యామీనన్

Nithya Menen

Nithya Menen

Nithya Menon : సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు నిత్యమీనన్. దీంతో దక్షిణాది సినిమాలు చేస్తూ పేరు, పలుకుబడి తెచ్చుకున్నారు. అటు సింగర్ గా, ఇటు హీరోయిన్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఏ పాత్ర పోషించిన దానికి పూర్తి న్యాయం చేస్తారు. ఆ డెడికేషన్ ఆమెకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. అలాంటి నిత్యామీనన్ ఇటీవల దర్శకనిర్మాతలను ఇబ్బందిపెడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

Read Also: Poorna: హీరోయిన్ పూర్ణ పెళ్లియిందా.. ఎవరూ వెళ్లకపోవడానికి కారణం అదేనా..?

అవకాశాలు ఇస్తామన్నా ఎందుకో ఈ అమ్మడు దర్శకనిర్మాతలకు కలిసే అవకాశం ఇవ్వడం లేదంట. ఇదే విషయం ఇప్పుడు కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అసలు కారణం ఏంటని ఆరా తీస్తే నిత్య కాల్ షీట్లను ప్రముఖ బాలీవుడ్ సంస్థలో పెట్టిందని తెలిసింది. దీంతో నిత్య కాల్ షీట్స్ కోసం సంస్థను కలవడం అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. దీంతోనే నిత్య ఇలా వారిని ఇబ్బంది పెడుతోందని సమాచారం. అసలు నిత్యామీనన్ ఎందుకిలా చేసిందన్నది తెలియాల్సి ఉంది.

Read Also: Sanjay Dutt: బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ దత్

ఈ వార్తలు ఇలా ఉంటే.. నిత్యామీనన్ మలయాళ నటుడిని పెళ్లి చేసుకోనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా ఒకరినొకరు చూస్తున్నారని, సంబంధాన్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారని పుకార్లు చెబుతున్నాయి. నిత్యా మీనన్ ఈ రూమర్స్‌ని చూసి వెంటనే స్పందించింది. తాను ఎవరినీ పెళ్లి చేసుకోనని చెప్పింది. తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని ఈ వార్తల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను కెరీర్‌పై దృష్టి సారించినట్టు తెలిపింది. ఆమె ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న వెబ్ ఆంథాలజీ మోడ్రన్ లవ్ హైదరాబాద్‌లో కనిపించింది. ధనుష్ చేయబోయే సినిమాలో నిత్య కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

Show comments