NTV Telugu Site icon

Nithin : దివాళీ డబుల్ ఢమాకా.. ఆ హీరో అదృష్టం మామూలుగా లేదుగా

Nithiin and Shalini celebrate their one year wedding anniversary

Nithin : దీపావళి బంపర్ ఆఫర్.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అన్నట్టు.. ఒకేసారి డబుల్ ధమాకా గుడ్ న్యూస్‎లు వినాలంటే దానికి ఎంతో అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం వరించింది మన తెలుగు హీరో నితిన్‎ని. ఎస్ అవునండి ఇప్పుడు నితిన్ ఇంట సంబరాలు షురూ అయ్యాయి . దానికి బిగ్గెస్ట్ కారణం నితిన్ తండ్రి కాబోతున్నాడట. యస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం మన తెలుగు హీరో నితిన్ తండ్రి కాబోతున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నితిన్ ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెప్తాడా అని ఆయన అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ ఆ మూమెంట్ వచ్చేసిన్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం నితిన్ తండ్రి కాబోతున్నాడట. శాలిని ప్రజెంట్ ప్రెగ్నెంట్ అంటూ న్యూస్ మీడియాకు లీక్ అయ్యింది.

Read Also: Vaarasudu: విజయ్ ‘వారసుడు’ వచ్చేస్తున్నాడు.. ఆఫీషియల్‎గా ప్రకటించిన టీం !

అంతేకాదు ఇక్కడ మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. నితిన్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ హౌస్ కూడా ఓకే అయిందట. ఈ డ్రీమ్ హౌస్ కోసం నితిన్ షాలిని పెళ్లి కాకముందు నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారట. కొన్ని అడ్డంకులు కారణంగా ఈ ప్రాజెక్టు వెనుకపడిపోతూ వచ్చిందట . అయితే ఎట్టకేలకు తమ డ్రీమ్ హౌస్ ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వడం ఒకేసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడంతో నితిన్ ఇంట సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also: Air Polution: ఢిల్లీలో తీవ్రస్థాయికి వాయుకాలుష్యం.. దీపావళి వేళ రెచ్చిపోయిన రాజధానివాసులు

ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించబోతున్నారని టాక్.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో మరీ చూడాల్సి ఉంది. వక్కంతం వంశీ కెరీర్ తొలి సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. హీరో నితిన్ కెరీర్ విషయం లో ఆచితూచి అడుగులు వేస్తున్నారట.