BJP MP Nishikant Dubey: బీజేపీ (BJP) ఎంపీ నిషికాంత్ దుబే (Nishikant Dubey) శనివారం కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీపై (Sonia Gandhi) సంచలన ఆరోపణలు చేశారు. మారుతి (Maruti) సంస్థకు సంబంధించిన కంపెనీలలో సోనియా గాంధీకి ఉన్న యాజమాన్య హక్కులు, షేర్ హోల్డింగ్, నియామకంపై ఎంపీ నిషికాంత్ దుబే పలు ప్రశ్నలు సంధించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’ వేదికగా స్పందించిన దుబే, మారుతి కంపెనీ ఏర్పాటు వెనుక మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) నేతృత్వంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలను ప్రస్తావించారు. సోనియా గాంధీని ‘మారుతి అసలు యజమాని’ అని అభివర్ణిస్తూ, ఒక విదేశీ పౌరురాలిగా ఉన్నప్పటికీ ఆమె ఆ కంపెనీలో కీలక పదవిలో ఎలా కొనసాగారని నిలదీశారు.
1970 నవంబర్ 21న సంజయ్ గాంధీ (Sanjay Gandhi), సోనియా గాంధీకి సంబంధించిన ‘మారుతి టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’తో (Maruti Technical Services Private Limited) ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని దుబే పేర్కొన్నారు. అంతేకాదు, మారుతి కంపెనీ 1970లో ఏర్పాటైతే, అంతకు రెండేళ్ల ముందే అంటే 1968లోనే కార్ల తయారీకి భారత ప్రభుత్వం నుంచి అనుమతి పత్రం ఎలా వచ్చిందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. విదేశీ పౌరురాలిగా ఉంటూనే సోనియా గాంధీ మారుతి కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా (Managing Director), 50 శాతం వాటాదారుగా ఎలా వ్యవహరించారని ప్రశ్నించారు. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ విదేశీ పౌరుడు కూడా భారతీయ కంపెనీలో డైరెక్టర్‌గా ఉండేందుకు వీలులేనప్పుడు, 1970లో ఆమె డైరెక్టర్ ఎలా అయ్యారని దుబే నిలదీశారు.
దేశంలో బ్యాంకుల జాతీయీకరణ అంశాన్ని కూడా ఆయన ఈ వివాదంతో ముడిపెట్టారు. కేవలం సోనియా గాంధీ కంపెనీలకు రుణాలు ఇప్పించడానికే నాడు బ్యాంకులను జాతీయీకరించారా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 1969లో ప్రధాని ఇందిరా గాంధీ తన కోడలు సోనియా గాంధీ కంపెనీ కార్లు తయారు చేయడానికి వీలుగా క్యాబినెట్ ఉత్తర్వులు జారీ చేశారని ఆరోపించారు. అలాగే 1972 ఏప్రిల్ 3న కంపెనీ పనుల నిమిత్తం సంజయ్ గాంధీ భారత ప్రభుత్వ ఖర్చుతో ప్రపంచ పర్యటన చేశారని విమర్శించారు. అప్పటి హర్యానా ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీయుల పేరు మీద భూమి కేటాయించే అవకాశం లేకపోయినా, 1970లో సోనియా గాంధీకి భూమి ఎలా కేటాయించారని ప్రశ్నించారు.
ప్రధానమంత్రి కార్యాలయం, ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా మారుతి కార్యకలాపాల్లో జోక్యం చేసుకున్నాయని నిషికాంత్ దుబే ఆరోపించారు. ఒక ప్రైవేట్ కంపెనీ కార్యాలయాన్ని ప్రధాని కార్యాలయంలో ఎలా తెరిచారని, ప్రధాని ప్రైవేట్ సెక్రటరీ ధావన్ (Mr Dhawan) ఆ కంపెనీకి డైరెక్టర్‌గా ఎలా మారారని ప్రశ్నించారు. కంపెనీ అసలు ఉనికిలోకి రాకముందే, ప్రధాని నేరుగా ఇచ్చిన ఆదేశాలతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బస్సు బాడీల (bus bodies) తయారీ కోసం మారుతికి అడ్వాన్స్ చెల్లింపులు చేశాయని, ప్రభుత్వ కంపెనీలు ఎలాంటి డబ్బు తీసుకోకుండానే సిమెంట్, స్టీల్, బొగ్గును నేరుగా మారుతికి సరఫరా చేశాయని ఆయన ఆరోపించారు. తన పోస్ట్ చివరలో నిషికాంత్ దుబే సోనియా గాంధీకి ఒక సవాల్ విసిరారు. తన సొంత డబ్బు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా అంత పెద్ద కంపెనీని ఎలా నిర్మించారో, ఇందిరా గాంధీ ఒక బహుమతిగా మారుతి కంపెనీని ఆమెకు ఎలా అప్పగించారో తన పుస్తకంలో వివరిస్తే బాగుంటుందని దుబే వ్యాఖ్యానించారు.
कांग्रेस का काला अध्याय, चैप्टर – 250
250. क्या आपको पता है कि विदेशी नागरिक होने के बावजूद सोनिया गांधी जी मारुति की मैनेजिंग डायरेक्टर और 50 प्रतिशत की हिस्सेदार थीं ? 21 नवंबर 1970 संजय गांधी जी ने सोनिया गांधी जी के मारुति टेक्निकल सर्विस प्राइवेट लिमिटेड के साथ समझौता किया ।मारुति कम्पनी की असली मालकिन सोनिया गांधी जी थी।मारुति कम्पनी 1970 में बनी, कार बनाने का पत्र भारत सरकार को 1968 में ही मिला ।1969 में प्रधानमंत्री इंदिरा गांधी जी ने अपने बहू यानि सोनिया गांधी जी के नेतृत्व वाली कम्पनी को कैबिनेट से कार बनाने का आदेश जारी कर दिया? अप्रैल 3 1972 को भारत सरकार के खर्च पर संजय गांधी जी कम्पनी के लिए दुनिया घुमने गए? सोनिया गॉंधी जी इस कंपनी की प्रबंध निदेशक और 50 प्रतिशत की मालिक कैसे बनी? भारत सरकार के नियमों के अनुसार कोई भी विदेशी नागरिक भारतीय कंपनी में निदेशक नहीं बन सकता था? 1970 में वह निदेशक कैसे बनी ? उनके कम्पनियों को लोन देने के लिए ही बैंकों का राष्ट्रीयकरण हुआ? हरियाणा सरकार के नियमों के अनुसार उस वक़्त ज़मीनों का आवंटन विदेशी के नाम नहीं हो सकता था,सोनिया गांधी जी को 1970 में ज़मीन आवंटित हुआ? प्रधानमंत्री कार्यालय में प्राइवेट कंपनी का दफ्तर कैसे खोला गया? प्रधानमंत्री के निजी सचिव धवन साहब इसके डायरेक्टर कैसे बने? प्रधानमंत्री के सीधे आदेश पर बिना कम्पनी बने सभी राज्य सरकारों ने मारुति को बसों का बॉडी बनाने के लिए अग्रिम भुगतान किया? सीमेंट,स्टील और कोयले सीधे बिना भुगतान के सरकारी कंपनियों ने मारुति को कैसे दिया?
काश सोनिया जी अपनी किताब में बिना अपने पैसे के निवेश के बड़ी कम्पनी कैसे बनी, प्रधानमंत्री इंदिरा गांधी जी ने मुँह दिखाई में उनको मारुति कम्पनी कैसे दिया के बारे में बतातीं
#CongressDarkHistory— Dr Nishikant Dubey (@nishikant_dubey) November 21, 2026

