Nirmala sitharaman: కేజ్రీవాల్ అరెస్ట్‌పై నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అరెస్ట్ విషయంలో ఎలాంటి రాజకీయ కక్షలు లేవని ఆమె తేల్చారు. ఢిల్లీ మద్యం ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమన్లకు స్పందించకపోవడంతో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారని చెప్పుకొచ్చారు. ఈ అరెస్ట్‌ను కేంద్రానికి ఆపాదించడం సరైంది కాదని ఆర్థిక మంత్రి మండిపడ్డారు. ఈడీ జారీ చేసిన సమన్లకు స్పందించకపోవడంతోనే అరెస్ట్ జరిగిందని తేల్చి చెప్పారు.
ఈడీ సమన్లు జారీ చేసినప్పుడల్లా ఏదో ఒక సాకుతో కేజ్రీవాల్ తప్పించుకుని తిరిగారని తెలిపారు. ఎన్నో సార్లు ఆయా కారణాలు చెప్పి తప్పించుకున్నారని గుర్తుచేశారు. సమన్లకు స్పందించకపోవడంతోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారే తప్ప ఇందులో రాజకీయ దుర్దేశం లేదని పేర్కొన్నారు.
Also Read
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
దర్యాప్తు సంస్థల బారి నుంచి తప్పించుకునేందుకే మహారాష్ట్రలో అశోక్ చవాన్, అజిత్ పవార్ లాంటి వాళ్లు బీజేపీలో చేరారని ఓ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు నిర్మల స్పందిస్తూ.. విలువల విషయంలో రాజీ పడబోమని.. బీజేపీలోకి ఎవరినైనా ఆహ్వాస్తామని ఆమె తెలిపారు.
ఇదిలా ఉంటే అరెస్ట్, ఈడీ కస్టడీపై హైకోర్టులో కేజ్రీవాల్ వేసిన పిటిషన్ విషయంలో ఊరట లభించలేదు. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఏప్రిల్ 2లోగా స్పందించాలని ఈడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 3కి విచారణ వాయిదా వేసింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ వంటి ఆప్ నేతలు జైలులో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్ట్ ఆప్‌కి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఆయనకు షుగర్ లెవల్స్ పడిపోతున్నాయని వాపోతున్నారు.
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..