NTV Telugu Site icon

Niranjan Reddy: కాంగ్రెస్ మంత్రులు చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారు..

Niranjana Reddy

Niranjana Reddy

Niranjan Reddy: కాంగ్రెస్ మంత్రులపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేఆర్ఎంబీలో తెలంగాణ చేరిందని కేంద్రం సమావేశ మినిట్స్ లో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. ఇప్పుడు చేరలేదని రాష్ట్ర మంత్రులు బుకాయిస్తున్నారని ఆరోపించారు. మంత్రుల నోటి మాట ప్రామాణికమా? మినిట్స్ ప్రామాణికమా? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ మంత్రులు చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Read Also: Ayodhya Ram Mandir : అయోధ్య రాముడికి విరాళమిచ్చిన సినీ ప్రముఖులు ఎవరంటే?

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కేంద్ర బలగాల పహారాలోకి వెళతాయని నిరంజన్ రెడ్డి సూచించారు. నీటి వాటా తేల్చేదాకా కేఆర్ఎంబీపై యథాతథ స్థితి కొనసాగాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పును సవరించుకోవాలన్నారు. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ ప్రజలు కాంగ్రెస్ ను భారీగా సీట్లతో గెలిపించినందుకు మీరిచ్చిన బహుమానమా ఇదా అని దుయ్యబట్టారు. ఆంధ్రా ప్రయోజనాలు నెరవేర్చెందుకే కేంద్రం కంకణం కట్టుకుందని తెలిపారు.
కేఆర్ఎంబీ పేరిట కృష్ణా నీళ్ల పై ఏపీ పెత్తనం సాగిస్తుందని నిరంజన్ రెడ్డి చెప్పారు. అధికారిక పర్యటనలో సీఎం రేవంత్ రాజకీయాలు మాట్లాడుతున్నారని.. కేసీఆర్ ను బొంద పెడతామన్న వారెందరో బొందలో కలిసి పోయారని నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Rashmika Mandanna: రష్మిక మందన్న “డీప్‌ఫేక్” వీడియో నిందితుడి అరెస్ట్..

Show comments