NTV Telugu Site icon

Minister Nimmala Ramanaidu: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిమ్మల.. పోలవరంపై సంచలన వ్యాఖ్యలు

Nimmala

Nimmala

Minister Nimmala Ramanaidu: ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు.. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. పోలవరం నుండి ఎత్తి పోతల వరకు ప్రతి ప్రాజెక్ట్స్ ను ప్రాధాన్యత క్రమంలో నిర్మాణాలు పూర్తి చేస్తాం అన్నారు. ఇరిగేషన్ నిధులు దారి మళ్లించి వైసీపీ నాయకుల జేబుల్లోకి మల్లించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు సీఎంగా పరిపాలన తెలిసిన నాయకుడు ఉన్నారు.. సోమవారాన్ని.. పోలవారంగా మార్చుకున్న ఘనత సీఎం చంద్రబాబుది అని గుర్తుచేశారు. గత పాలకులు పోలవరాన్ని అడ్డుకుని మూలన పెట్టారు.. జగన్ విధ్వంసానికి పోలవరం ఒక సాక్షిగా ఉందన్నారు. 2019 లో వైసీపీ అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్‌ పేరు తో పోలవరాన్ని అడ్డుకున్నారు.. ఏజెన్సీలను మార్చేశారు.. అధికారులను బదిలీ చేసశారు.. జలశక్తి శాఖ నోటీసులు ఇచ్చినా ప్రభుత్వంలో మార్పు రాలేదు అని మండిపడ్డారు.

Read Also: TGPSC Group 4: నేటి నుంచి గ్రూప్‌ 4 ధ్రువీకరణ పత్రాల పరిశీలన.. ఎప్పటి వరకు అంటే..

వైసీపీ ప్రభుత్వం తప్పిదం వల్లే పోలవరం డయా ఫ్రం వాల్ దెబ్బతిందని విమర్శించారు మంత్రి నిమ్మల.. 2020లో వచ్చిన వరదలు పోలవరం డయా ఫ్రం వాల్ దెబ్బతింది .. ఈ విషయాన్ని నీతి అయోగ్ స్పష్టం చేసిందన్న ఆయన. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు హయంలో పోలవరాన్ని పునర్నిర్మిస్తాం అని ప్రకటించారు. నాకు మంత్రి అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు , లోకేష్ కు ధన్యవాదాలు చెబుతున్నారు.. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనలో మా ప్రభుత్వం ఉందన్నారు. ఇక, గత ప్రభుత్వం వ్యవసాయం పట్ల రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది… ఐదేళ్ల జగన్ పాలన లో లాకులకు, గేట్లకు మరమత్తులు చేయలేదు.. కనీసం గ్రీజు కూడా పెట్టలేదు.. వ్యవసాయ సీజన్ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన గేట్ల మరమత్తులు చేపిస్తాం అని స్పష్టం చేశారు.

Read Also: ENG vs WI: చెలరేగిన సాల్ట్, బెయిర్‌స్టో.. సూపర్-8లో విండీస్‌ను చిత్తుచేసిన ఇంగ్లండ్!

వైసీపీ పాలకులు డ్రెయిన్ లలో తట్ట పూడిక తీపించలేక పోయారు అని దుయ్యబట్టారు నిమ్మల.. రాబోయే వ్యవసాయ సీజన్ ప్రారంభం అయ్యేలోపు డ్రైన్ ల మరమత్తులు చేపిస్తామన్న ఆయన.. గత పాలన లో వరదలు, తుఫాన్‌లను ఎదుర్కొనేందుకు అవసరమైన ఇసుక బస్తాలు కూడా అందు బాటులో లేవు దుయ్యబట్టారు.. భవిష్యత్ లో వరదలు ఎదుర్కొనేందుకు అవసరమైన యంత్ర, సామాగ్రిని సిద్ధం చేస్తాం.. వైసీపీ పాలనలో వ్యవసాయం తిరోగమనం చెందింది.. కానీ, మేం రైతుకు అవసరం ఐయిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం అన్నారు. 2014- 2019 మధ్యలో కేంద్రం సకాలంలో బిల్లులు ఇవ్వక పోయినాపోలవరాన్ని నిర్మించాం.. 2019 నుండి అధికారంలో ఉన్న వైసీపీ పోలవరాన్ని ముంచేసిందని ఫైర్‌ అయ్యారు. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో మళ్లీ పోలవరాన్ని పునర్ నిర్మించేందుకు చక్కటి సహకారం వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. 2019 నుండి ఒక సంవత్సరం టీడీపీ అధికారంలోకి ఉంటే పోలవరం పూర్తయ్యేదని.. కానీ, వైసీపీకి అధికారం ఇవ్వడం వల్ల పోలవరంలో విధ్వంసం జరిగిందన్నారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టుపై శ్వేత పత్రాన్ని విడుదల చేస్తాం అని ప్రకటించారు ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.